మాఫియా డాన్‌గా ప్రభాస్‌! | Prabhas playing the role of mafia don in Sandeep Reddy Vanga Spirit | Sakshi
Sakshi News home page

మాఫియా డాన్‌గా ప్రభాస్‌!

Jun 8 2025 4:23 AM | Updated on Jun 8 2025 8:31 AM

Prabhas playing the role of mafia don in Sandeep Reddy Vanga Spirit

ప్రభాస్‌ మాఫియా డాన్‌పాత్రలో కనిపించనున్నారా? అంటే... వార్తల్లో ఉన్న ప్రకారం ‘స్పిరిట్‌’ సినిమాలో ఈపాత్రలో కనిపిస్తారట. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ‘స్పిరిట్‌’ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీసాఫీపర్‌పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రకథలో ఫ్లాష్‌బ్యాక్‌ ఉందట. ఈ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ మాఫియా నేపథ్యంలో ఉంటుందని, ఆ సన్నివేశాల్లో ప్రభాస్‌ మాఫియా డాన్‌లా కనిపిస్తారని సమాచారం.

ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే... ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌ క్యారెక్టర్‌లో త్రీ షేడ్స్‌ ఉంటాయట. వాటిలో ఒకటిపోలీసాఫీసర్‌ క్యారెక్టర్‌ అని, మరొకటి మాఫియా డాన్‌ అని భోగట్టా. మరి... ఇంకోపాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. అసలు ఈ చిత్రంలో ప్రభాస్‌పాత్రలో త్రీ షేడ్స్‌ ఉంటాయా? అనే విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. త్రిప్తి డిమ్రి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement