
హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన స్పై యూక్షన్ మూవీ ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 14న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా కోసం హృతిక్–కియారాలపై చిత్రీకరించిన ‘ఆవన్ జావన్ ...’ అనే పాటను అతి త్వరలోవిడుదల చేయనున్నట్లు వెల్లడించి, ఈ పాట ఫస్ట్‌లుక్ రోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
‘‘హృతిక్ రోషన్ – కియారా అద్వానీ కెమిస్ట్రీ ‘అవన్ జావన్ ..’ ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పాట కోసం సంగీత దర్శకుడు ప్రీతమ్, లిరిక్ రైటర్ అమితాబ్ భట్టాచార్య, గాయకుడు అరిజీత్ సింగ్ కలిసి పని చే శారు. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని ‘కేసరియా...’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సాంగ్ తరహాలోనే ‘ఆవన్ జావన్ ..’ కూడా ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
కాగా... ఈ నెల 31న కియారా అద్వానీ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఆవన్ జావన్ ...’ పాటని రిలీజ్ చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే... హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘వార్’ (2019) సినిమాకు సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందిన సంగతి తెలిసిందే.