
హీరో ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘వార్ 2’. హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) సంస్థ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘‘భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘వార్ 2’. ఇండియన్ సినీ హిస్టరీలో ఇద్దరు బిగ్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఉండేపోటీ ప్రేక్షకులకు ఓ విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది.
ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ స్పై యూనివర్స్‌లో భాగంగా మరో అధ్యాయంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పఠాన్, టైగర్ 3, వార్’ వంటి గ్లోబల్ హిట్ మూవీస్ తర్వాత వస్తోన్న ‘వార్ 2’ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనుండటం హ్యాపీగా ఉంది. ఆగస్ట్ 14న థియేటర్స్‌లో ఈ ఉత్సవం మొదలు కానుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోనూ రిలీజ్ కానుంది’’ అని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ పేర్కొంది.