
హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కిన చిత్రం 'వార్ 2'... యశ్‌రాజ్ ఫిల్మ్స్ తన స్పై యూనివర్స్‌లో భాగంగా నిర్మించారు. ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ట్రైలరను కూడా మేకర్స్ పంచుకున్నారు. అయితే, వార్ 2 ట్రైలర్ను షేర్ చేస్తూ అలియా భట్ షాకిచ్చింది. థియేటర్‌లో కలుద్ధాం అంటూ సడెన్గా సర్‌ప్రైజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతవరకు ఈ చిత్రంలో అలియా భట్ నటిస్తున్నట్లు ఎక్కడే కాని వార్తలు రాలేదు. తొలిసారి ఆమె ఇలా పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది.

అలియా భట్ తాజాగా చేసిన పోస్ట్ను గమనిస్తుంటే వార్ 2లో ఆమె అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, చాలా రహస్యంగా ఆమె పాత్రను చిత్రీకరణ చేసినట్లు సమాచారం. షూటింగ్ సమయంలో కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట. కానీ, ఇదంతా ఆమె తర్వాతి చిత్రం 'ఆల్ఫా'తో వార్2 లింక్ ఉంటుందని టాక్.. యశ్‌రాజ్ ఫిల్మ్స్ తన స్పై యూనివర్స్‌లో భాగంగానే ఆల్ఫా చిత్రం రానుంది. ఈ ఏడాది డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. స్పై యూనివర్స్‌లో రాబోతున్న మొదటి మహిళా గూఢచారి చిత్రంగా ఆల్ఫా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇందులో (Alpha) అలియా గురువు పాత్రలో హృతిక్ రోషన్ కనిపించనున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాలు కూడా గతంలో తెలిపాయి. వార్2లో అలియా నటిస్తున్నట్లు అధికారికంగా ఏమీ ధృవీకరించబడనప్పటికీ ఆమె చేసిన పోస్ట్తో నెట్టింట ట్రెండ్ అవుతుంది. వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆల్ఫా చిత్రాన్ని శివ్ రావేల్ దర్శకత్వంలో రానుంది. అయితే, ఈ రెండు ప్రాజెక్ట్లను బాలీవుడ్ అగ్ర నిర్మాణసంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్ నిర్మిస్తుంది.