వార్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్‌.. కొత్త లుక్‌ ఫోటోలు వైరల్‌ | Junior NTR Enter In War 2 Movie Shooting | Sakshi
Sakshi News home page

వార్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్‌.. కొత్త లుక్‌ ఫోటోలు వైరల్‌

Apr 11 2024 3:20 PM | Updated on Apr 11 2024 4:06 PM

Junior NTR Enter In War 2 Movie Shooting - Sakshi

బాలీవుడ్‌ ‘వార్‌’లో అడుగుపెట్టేశారు జూనియర్‌ ఎన్టీఆర్‌. హృతిక్‌రోషన్, తారక్‌‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్‌ 2’. 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్‌’కు సీక్వెల్‌గా ‘వార్‌ 2’ తెరకెక్కుతోంది. ‘వార్‌’కి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా, ‘వార్‌ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. ఇప్పటికే ‘వార్‌ 2’ చిత్రీకరణ పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయనే విషయం తెలిసిందే.. హృతిక్‌రోషన్‌కు సంబంధించిన చాలా సీన్లు మేకర్స్‌ చిత్రీకరించేశారు.

తాజాగా తారక్ వార్‌ 2 షూటింగ్‌లో జాయిన్ అయ్యేందకు ముంబై బయల్దేరారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ స్టూడియోలో సుమారు 10 రోజుల పాటు వార్‌  షూటింగ్‌లో తారక్‌ పాల్గొననున్నారు. వార్‌2 కోసం ఎన్టీఆర్‌ 60రోజులు కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హృతిక్‌, తారక్‌ మధ్య వచ్చే భారీ యాక్షన్ సీన్లను తెరకెక్కించబోతున్నారని బాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. వారిద్దరు కలిసి మొత్తంగా 30 రోజుల పాటు కలిసి షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు.

ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపిస్తారని టాక్‌. ‘వైఆర్‌ఎఫ్‌’ (యశ్‌రాజ్‌ ఫిలింస్‌) స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ‘వార్‌ 2’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' షూటింగ్‌ పనులతో కూడా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. కొరటాల శివ డైరెక్ట్‌ చేస్తున్నాడు. 2024 అక్టోబర్‌ 10న  దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆపై వెంటనే ప్రశాంత్‌ నీల్‌తో తారక్‌ సినిమా ప్రారంభించాల్సి ఉంది. ఇలా వరుసగా పాన్‌ ఇండియా సినిమాలతో తారక్‌ వచ్చేస్తున్నారు. దీంతో పాన్‌‌ ఇండియాలో తారక్‌ క్రేజీ భారీగా పెరగడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement