
గత కొన్నేళ్లలో చూసుకుంటే పలు దేశాల మధ్య యుద్ధం తరహా పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా థాయ్ ల్యాండ్, కంబోడియా మధ్య ఓ దేవాలయం విషయమై పెద్ద గొడవే జరుగుతుంది. ఎక్కడికిక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఎవరైనా మీరు నివసించే ప్రదేశంలో 'వార్' అని రాస్తే ఎలా ఉంటుంది. గజగజ వణికిపోతారు కదా! ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ అలాంటిదే జరిగింది.
ఇంతకీ ఏంటి విషయం?
గురువారం ఉదయం ఆస్ట్రేలియాకు చెందిన ఓ నెటిజన్.. తాను నివసించే మెల్‌బోర్న్‌లో ఆకాశంలో ఎవరో 'వార్ 2' అని రాశారని, దీని గురించి ఎవరికైనా తెలుసా? అని ట్వీట్ చేశారు. రిప్లై ఇచ్చిన మరో నెటిజన్.. 'తమ అభిమాన హీరో ఎన్టీఆర్ కొత్త సినిమా 'వార్ 2'ని ప్రమోట్ చేసేందుకు ఇలా ప్రేమ చూపించాం' అని చెప్పుకొచ్చాడు. దీనిపై స్పందించిన సదరు నెటిజన్.. 'సడన్‌గా ఆకాశంలో వార్ అని రాస్తే మా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి' అని తన భయాన్ని బయటపెట్టింది.
(ఇదీ చదవండి: 'మంచు వారి పప్పు'.. మోహన్ బాబు స్పెషల్ రెసిపీ)
పాపం ఆస్ట్రేలియా ప్రజలు. ఎన్టీఆర్ అభిమానులు చేసిన ఈ పని వల్ల తెగ భయపడిపోయారు. 'వార్ 2' సినిమా గురించి మనవాళ్లకు తెలుసు. కాబట్టి ఇక్కడా ఇలా రాసినా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ దేశం కానీ దేశంలో ఇలా అభిమానం చూపించేసరికి అక్కడి ప్రజలు నిజంగా యుద్ధం ఏమోనని తెగ భయపడిపోయారు. చెప్పాలంటే వణికిపోయింటారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
'వార్ 2' విషయానికొస్తే.. ఎన్టీఆర్ చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ. యష్ రాజ్ ఫిల్మ్స్ ఫ్రాంచైజీలో తీస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరో కాగా, ఎన్టీఆర్ నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. కియారా అడ్వాణీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: మళ్లీ ఇన్నేళ్లకు ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్.. 'వార్ 2' ట్రైలర్ రిలీజ్)
We, the fans, showering our love on our demigod @tarak9999 by promoting the movie #War2 which is releasing on August 14. #War2Trailer
— Agent Vikram Reddy (@Vikram2892) July 24, 2025
Can you imagine, we the civilian, seeing War written in the sky on a random day?
— benyamin (@bbap53) July 24, 2025