
కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ కాస్త బొద్దుగా ఉండేవాడు. 'రాఖీ' సినిమాలో తారక్ రూపంపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత రాజమౌళి 'యమదొంగ' కోసం పూర్తి సన్నగా మారిపోయాడు. అప్పటినుంచి దాదాపు ఒకేలాంటి లుక్ మెంటైన్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు సినీ కెరీర్‌లో రెండోసారి సిక్స్ ప్యాక్ చూపించాడు. ఇంతకీ ఏంటి విషయం?
(ఇదీ చదవండి: ఓటీటీలో 'మార్గన్'.. సడెన్‌గా తెలుగు స్ట్రీమింగ్)
దాదాపు ఏడేళ్ల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా 'అరవింద సమేత'. ఈమూవీ కోసం సిక్స్ ప్యాక్ చూపించాడు. షర్ట్ లేకుండానే తారక్ ఇంట్రో ఫైట్‌లో కనిపించాడు. అంతకు ముందు 'టెంపర్'లోనూ సిక్స్ ప్యాక్ చూపించాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మరోసారి సిక్స్ ప్యాక్ చేశాడు. అదీ బాలీవుడ్ సినిమా కోసం. 'ఆర్ఆర్ఆర్' తర్వాత తారక్.. హిందీలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే 'వార్ 2'.
యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో తీసిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులు. ఆగస్టు 14న మూవీ రిలీజ్ కానున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో హృతిక్-తారక్ ఢీ అంటే ఢీ అనేలా కనిపించారు. ట్రైలర్‌లోనే తారక్ సిక్స్ ప్యాక్ లుక్ చూపించారు. ఇదే ఫ్యాన్స్‌కి మంచి ఫీస్ట్ ఇస్తోంది. ట్రైలర్ అయితే ఫుల్ ఆన్ యాక్షన్‌తో ఆకట్టుకుంటోంది. మరి మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.
(ఇదీ చదవండి: 'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్)