
రీసెంట్ టైంలో సీనియర్ నటుడు మోహన్ బాబు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. గత కొన్నాళ్లుగా వీళ్ల కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. కొడుకులు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు జరిగాయి. ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లారు. కొన్నిరోజులుగా మాత్రం అంతా సైలెంట్ అయిపోయారు. సరే ఈ విషయాలని వదిలేస్తే మోహన్ బాబు.. తన స్పెషల్ రెసిపీ గురించి బయటపెట్టారు. ఇంతకీ ఏంటది?
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)
సెలబ్రిటీలతో ఫుడ్ వ్లాగ్స్ చేసే యూట్యూబర్ కమియా జానీ.. తాజాగా జల్‍పల్లిలోని మోహన్ బాబు ఇంటికి కూడా వచ్చింది. ఆయనతో కలిసి మధ్యాహ్న భోజనం చేసింది. ఈ క్రమంలోనే మోహన్ బాబు.. 'మంచువారి పప్పు' గురించి చెప్పుకొచ్చారు. అందరూ చేసే పప్పు అయినప్పటికీ తన ఇంటి పేరుని దానికి జోడించామని మోహన్ బాబు చెప్పారు. ఇప్పుడు ఈ బిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తనకు అరటి ఆకులో భోజనం చేయడమే ఇష్టమని.. ప్రతిరోజూ సమయానికల్లా భోజనం చేసేస్తానని చెప్పుకొచ్చారు. త్వరలో రెస్టారెంట్ బిజినెస్‌లోకి వచ్చే ఆలోచన కూడా ఉందని తన మనసులోని మాటని మోహన్ బాబు బయటపెట్టారు. ఇప్పటికే సినిమా నటుడిగా, నిర్మాతగా ఈయన చాలామందికి తెలుసు. 'శ్రీ విద్యా నికేతన్' అని వీళ్లకు విద్యాసంస్థ కూడా ఉంది. ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టనున్నారు. మరి ఎప్పుడు ఎక్కడ ఓపెన్ చేస్తారనేది త్వరలో చెబుతారేమో?
(ఇదీ చదవండి: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'సయారా' రివ్యూ)