
"బిగ్‌బాస్ షోలో సామాన్యులు". కామన్ మ్యాన్ అంటారే కానీ వారు అప్పటికే సోషల్ మీడియాలో కొద్దోగొప్పో ఫేమస్ అయినవారినే రియాలిటీ షోకి తీసుకొస్తారు! గత రెండు మూడు సీజన్లలో ఇదే జరిగింది. అయితే ఈసారి (Bigg Boss Telugu 9) ఒక్కరిని కాదు కనీసం ముగ్గురు, నలుగురినైనా కామన్ మ్యాన్ కేటగిరీ కింద ఎంపిక చేస్తారట! ఇప్పటికే షోలో పాల్గొనడానికి అనేకమంది వీడియోలు పంపి దరఖాస్తులు చేసుకున్నారు.
40 మందితో షో
మొదటి దశలో సుమారు 200 మందిని సెలక్ట్ చేశారు. హావభావాలు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్.. ఇలా పలు అంశాల ఆధారంగా వీడియోలు జల్లెడ పట్టి అందులో 100 మందిని ఎంపిక చేశారు. వీరితో గ్రూప్ డిస్కషన్స్ అయ్యాక చివరగా 40 మందిని ఫైనలైజ్ చేశారు. ఇప్పుడీ 40 మంది మధ్యే అసలైన పోటీ జరగనుంది. వీరికి బిగ్‌బాస్ అగ్నిపరీక్ష (BIGG BOSS AGNIPARIKSHA) పెట్టనున్నాడు. ఈ పరీక్షలో నెగ్గినవారే షోలో కంటెస్టెంట్లుగా అడుగుపెట్టనున్నారు.
అగ్నిపరీక్ష
అసలు ఆ 40 మంది ఎవరు? ఆ అగ్నిపరీక్షలో ఎలాంటి టాస్కులిస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే! అయితే ఈ అగ్నిపరీక్షను బిగ్‌బాస్ అభిమానులు జియోహాట్‌స్టార్‌లో చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. వచ్చే నెలలోనే ఈ అగ్నిపరీక్ష కార్యక్రమం ఉండనుంది. ఇందులోనుంచి ముగ్గురు, నలుగురు కంటెస్టెంట్లను ఎంపిక చేసిన తర్వాత.. సెప్టెంబర్‌లో బిగ్‌బాస్ 9 ప్రారంభం కానుంది.
చదవండి: చైసామ్ విడాకులపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. కేసు వాయిదా