
‘‘వెండితెరపై యుద్ధానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 30 రోజుల్లో బాక్సాఫీస్ విధ్వంసానికి ‘వార్ 2’’ సిద్ధం అంటూ చిత్రయూనిట్ పేర్కొంది. హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా హీరో ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా విడుదల కానుంది.

‘వార్ 2’ ముప్పై రోజుల్లో రానుందని తెలిసేలా తాజాగా ఓపోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీపాత్రల్ని చూపించేలా డిజైన్ చేశారు. ‘‘యాక్షన్ ఓరియంటెడ్ స్పై డ్రామాగా రూపొందిన చిత్రం ‘వార్ 2’’ అని చిత్రబృందం పేర్కొంది.