
యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం వార్-2. ఈ మూవీలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ ఫుల్ యాక్షన్ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హీరోయిన్ కియారా బికినీలో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఆ హీరోయిన్‌ను అలా చూసిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు.
అయితే ఈ టీజర్ చూసిన టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ సైతం టీజర్ చూసి ఓ పోస్ట్ పెట్టారు. అందులో కియారా అద్వానీ బికినీ డ్రెస్‌ను ఉద్దేశించి పోస్ట్ చేయడంతో అది కాస్తా వివాదానికి దారితీసింది. ఆర్జీవీ పోస్ట్ చూసిన నెటిజన్స్ చెత్త పోస్ట్ అంటూ రాం గోపాల్ వర్మపై విమర్శలు చేశారు. రామ్ గోపాల్ వర్మ భాయ్, ఏదైనా పోస్ట్ చేసే ముందు కాస్తా ఆలోచించండి.. అప్పుడు మీరు ఇలాంటివి పోస్ట్ చేయరంటూ ఓ నెటిజన్ సలహా ఇచ్చారు.
తన ట్వీట్‌పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆర్జీవీ తన పోస్ట్‌ను సోషల్ మీడియాలో తొలగించాడు. కియారా అభిమానులు, నెటిజన్స్ నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో పోస్ట్ డిలీట్ చేశాడు. కాగా.. వార్- 2 లో హృతిక్ రోషన్ రా ఏజెంట్ మేజర్ కబీర్ ధిలావాల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.