సలాం అనాలి సాంగ్‌ టీజర్‌: డ్యాన్స్‌ ఇరగదీసిన స్టార్స్‌.. కానీ..! | Janaabe Ali Song Promo Out from Jr NTR, Hrithik Roshan Starrer War 2 Movie | Sakshi
Sakshi News home page

వార్‌ 2 సాంగ్‌.. హృతిక్‌తో కలిసి డ్యాన్స్‌ కుమ్మేసిన తారక్‌..

Aug 7 2025 12:35 PM | Updated on Aug 7 2025 12:44 PM

Janaabe Ali Song Promo Out from Jr NTR, Hrithik Roshan Starrer War 2 Movie

హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ వార్‌ 2. ఈ చిత్రంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ బాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఇకపోతే చిత్రయూనిట్‌ ఆన్‌లైన్‌ ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది.

ఆన్‌లైన్‌ ప్రమోషన్స్‌
ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్‌లు అంటూ హంగామా చేయకుండా సోషల్‌ మీడియాలోనే ప్రమోషన్స్‌ నిర్వహిస్తోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR).. వార్‌ 2 మూవీలోని తన పోస్టర్‌తో ఉన్న బిల్‌బోర్డ్‌ను హృతిక్‌ ఇంటికి పంపించాడు. ఈ యుద్ధాన్ని మాతో గెలవలేరు అంటూ హీరోకు సవాలు విసిరాడు. అందుకు హృతిక్‌.. తన పోస్టర్‌ ఉన్న బిల్‌బోర్డ్‌ను తారక్‌ ఇంటికి పంపాడు. మీరు నాటునాటు డ్యాన్స్‌ ఎంత చేసినా.. ఈ యుద్ధంలో గెలిచేది మాత్రం నేనే అని రిప్లై ఇచ్చాడు. అలా వీరి మధ్య సోషల్‌ మీడియాలో సరదా వార్‌ జరుగుతోంది.

ఫుల్‌ సాంగ్‌ కావాలంటే..
తాజాగా ఈ యుద్ధాన్ని పక్కనపెట్టి వీరిద్దరూ ఒకరితో మరొకరు పోటీపడుతూ స్టెప్పులేశారు. జనాబే ఆలి (తెలుగులో సలాం అనాలి) పాటకు స్టైలిష్‌ స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్‌ చేశారు. ఫుల్‌ సాంగ్‌ ఎప్పుడనుకుంటున్నారా? ఆగస్టు 14న.. యూట్యూబ్‌లో కాదు.. ఏకంగా థియేటర్‌లోనే ఫుల్‌ సాంగ్‌ చూసేయండని చెప్తున్నారు. ఏదేమైనా పాట మాత్రం అదిరిపోయిందంటున్నారు.

 

 

 

చదవండి: ఇబ్బందిగా ఉందని చెబితే.. సౌత్‌ స్టార్‌ హీరో నాపై కేకలు వేశాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement