
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న చాలామంది కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నవాళ్లే. అవమానాలను భరించి, అవకాశం వచ్చినప్పుడు తమ టాలెంట్ని నిరూపించుకున్నవాళ్లే ఇప్పుడు స్టార్స్గా కొనసాగుతున్నారు. అలాంటి వారిలో తమన్నా(Tamanna Bhatia ) కూడా ఒకరు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ మిల్కీ బ్యూటీ.. కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిదట. చాలామంది తనను అవమానించి, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలినాళ్లలో తనకు ఎదురైన ఓ సంఘటన గురించి చెప్పింది. తనకు అసౌకర్యంగా ఉందని చెప్పినందుకు ఓ స్టార్ హీరో కేకలు వేసి.. తన స్థానంలో మరో నటిని తీసుకోవాలని ఆదేశించారట.
(చదవండి: విడాకుల బాటలో మరో సీనియర్ హీరోయిన్!)
‘చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చాను కాబట్టి నాకేమి తెలియదని చాలా మంది అనుకున్నారు. నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. చాలాసార్లు నన్ను అవమానించేందుకు ప్రయత్నంచారు. కెరీర్ ప్రారంభంలో సౌత్కి చెందిన ఓ పెద్ద హీరోకి జోడిగా నటించే అవకాశం వచ్చింది. ఆయనతో కొన్ని సీన్లలో నటించాల్సి వచ్చినప్పుడు నాకు కాస్త అసౌకర్యంగా అనిపించింది. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలకు చెప్పి.. నాకు ఇబ్బందిగా ఉంది చేయలేనన్నాను. వెంటనే ఆ స్టార్ వచ్చి నాపై కేకలు వేశాను. దర్శక నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘హీరోయిన్ని మార్చేయండి’ అన్నారు. అప్పుడు నేను కాస్త బాధ పడ్డాను కానీ తిరిగి ఆ హీరోని ఏమి అనలేదు. మౌనంగా ఉండిపోయాను. మరుసటి రోజు ఆ స్టార్ హీరోనే నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. కోపంలో అలా అరిచానని, అలా ప్రవర్తించి ఉండకూడదని పశ్చాత్తాపపడ్డాడు’ అని తమన్నా చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో పేరు చెప్పడానికి మాత్రం నిరాకరించింది.
(చదవండి: 40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న నటి.. 'మగవాడ్ని ఇలాంటి ప్రశ్నలు అడగ్గలరా?')
తమన్నా సీనీ కెరీర్ విషయానికొస్తే.. 2005లో ‘చాంద్ సా రోష్ చెహ్రా’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మంచు మనోజ్ శ్రీ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. హ్యాపీడేస్తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో వరుస అవకాశాలు వచ్చాయి. చిరంజీవి, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలతో పాటు మహేశ్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసింది. ఆ మధ్య ఓదెల 2 మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం నాలుగు హిందీ సినిమాల్లో నటిస్తున్నారు.