కళ్లకు కాటుక పెట్టుకున్నా బాధనే!: బుల్లితెర నటి | Priyanka Chahar Choudhary Reacts to Plastic Surgery Rumours | Sakshi
Sakshi News home page

Priyanka Chahar Choudhary: నా పరిస్థితి గురించి మీకు తెలీదు.. ఆ సమయంలో చాలా..

Dec 25 2025 2:43 PM | Updated on Dec 25 2025 3:42 PM

Priyanka Chahar Choudhary Reacts to Plastic Surgery Rumours

సెలబ్రిటీల ముఖంలో కాస్త తేడా కనిపించినా నెటిజన్లు ఇట్టే పసిగడతారు. అది మేకప్‌ మహిమో? లేక డైట్‌ వల్ల అలా అయిందో అనడానికి బదులుగా ఏకంగా సర్జరీ చేయించుకుందని ఈజీగా అనేస్తారు. మరింత అందంగా కనిపించడం కోసం ముక్కుకు, ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుందని కామెంట్లు చేస్తారు. బుల్లితెర నటి ప్రియాంక చాహర్‌ చౌదరిపై కూడా కొంతకాలంగా ఇలాంటి రూమర్లే వస్తున్నాయి.

ప్లాస్టిక్‌ సర్జరీ రూమర్స్‌
తాజాగా వీటిపై ప్రియాంక స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. చాలారోజులుగా నాపై ఎన్నో రూమర్స్‌ వైరల్‌ అవుతున్నాయి. గతేడాది నా ఆరోగ్యం బాగోలేక ట్రీట్‌మెంట్‌ తీసుకున్నాను. ఎక్కువ డోస్‌ ఉన్న యాంటిబయాటిక్స్‌ వాడాను. చాలామంది జనాలకు ఈ విషయం తెలియనే తెలియదు. ఆ సమయంలో బరువు తగ్గిపోయాను కానీ ముఖం మాత్రం కాస్త ఉబ్బింది. 

కళ్లకు కాటుక రుద్దినా..
అంతదానికే జనాలు ఏదేదో ఊహించుకున్నారు. అయినా అందాన్ని మెరుగుపర్చుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. నేనేం చేయాలనుకున్నా, చేసినా అది నా ఇష్టం. ఇప్పుడు నేను కళ్లకు కాటుక రుద్దినా, లెన్స్‌ పెట్టుకున్నా సరే.. ముఖానికి ఏదో చేయించుకున్నానని మాత్రమే అంటారు. అందుకే నేను చెప్పేదేంటంటే.. నా ముఖం.. నా ఇష్టం! 

సీరియల్‌
అయినా నా ఫేస్‌కు మేకప్‌ వేయడం తప్ప ఏదీ చేయలేదు. అయినప్పటికీ జనాలు అది మేకప్‌ అని నమ్మరు.. ఇంకా ఏదో ఉందని మాట్లాడుతూనే ఉంటారు. అది కరెక్ట్‌ కాదు అని చెప్పుకొచ్చింది. ప్రియాంక చౌదరి.. 'ఉడారియాన్‌' సీరియల్‌తో బాగా పాపులర్‌ అయింది. ప్రస్తుతం 'నాగిని 7' సీరియల్‌ చేస్తోంది. ఏక్తా కపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సీరియల్‌ డిసెంబర్‌ 27న ప్రారంభం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement