దేశంలో బెస్ట్ డ్యాన్సర్ల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు హృతిక్ రోషన్. ఇతడి స్టెప్పులకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఏడాది 'వార్ 2'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన హృతిక్.. ఇందులోనూ ఓ పాటలో డ్యాన్స్ అదరగొట్టేశాడు. ఇప్పుడు బయట ఓ పెళ్లిలోనూ స్టేజీపై స్టెప్పులు ఇరగదీశాడు. అయితే ఇద్దరు కొడుకులతో కలిసి ఇది చేయడం ఇక్కడ విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: 'దండోరా' సినిమా రివ్యూ)
హృతిక్ రోషన్ మామ కొడుకు ఈషాన్ రోషన్ పెళ్లి రెండు రోజుల క్రితం ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ సినీ తారలు హాజరయ్యారు. హృతిక్ తన ప్రేయసి షబా ఆజాద్‌తో కలిసి సందడి చేశాడు. ఇతడి మాజీ భార్య సుస్సానే ఖాన్ కూడా తన కొడుకులతో కలిసి పెళ్లిలో కనిపించింది.
సంగీత్ సందర్భంగా హృతిక్.. తన ఇద్దరు కొడుకులు హ్రేహాన్, హృదాన్‌తో కలిసి హిందీ పాటకు స్టెప్పులేశాడు. హృతిక్ అనుకుంటే కుమారులు కూడా తండ్రితో పోటీపడి డ్యాన్స్ చేయడం విశేషం. చూస్తుంటే వీళ్లకు కూడా యాక్టింగ్, డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లే కనిపిస్తుంది. మరి త్వరలో నటులుగా ఎంట్రీ ఇస్తారేమో?
(ఇదీ చదవండి: హారర్ సినిమా 'ఈషా' రివ్యూ)
Damn 😱 Gotta get lighter on my feet to keep up 🕺🏻 pic.twitter.com/UFnHNEIR7p
— Hrithik Roshan (@iHrithik) December 25, 2025


