శ్రేయస్‌ అయ్యర్‌ వరల్డ్‌ రికార్డు.. క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి | Shreyas Iyer becomes first captain to do this in India-Japan 5-over T20I | Sakshi
Sakshi News home page

IND vs JPN: శ్రేయస్‌ అయ్యర్‌ వరల్డ్‌ రికార్డు.. క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి

Sep 22 2026 4:47 PM | Updated on Sep 22 2026 4:52 PM

Shreyas Iyer becomes first captain to do this in India-Japan 5-over T20I

PC: Japan cricket

సానో అంత‌ర్జాతీయ క్రికెట్ మైదానం వేదిక‌గా జ‌పాన్‌తో జ‌రిగిన చారిత్రతక మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఓ అరుదైన ఘ‌న‌త సాధించాడు. వర్షం ఆటంకం కలిగించడంతో అంపైర్లు ఈ మ్యాచ్‌ను ఇరు జట్లకు 5 ఓవర్ల చొప్పున కుదించారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన అయ్యర్ ఎలాంటి సంకోచం లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

తద్వారా  5 ఓవర్ల టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ ఎంచుకున్న మొదటి ఐసీసీ ఫుల్ టైమ్ జ‌ట్టు కెప్టెన్‌గా అయ్యర్ నిలిచాడు. ఇక  మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. చివ‌రి ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఈ పోరులో 2 ప‌రుగుల తేడాతో టీమిండియా విజ‌యం సాధించింది. ఈ గెలుపుతో భార‌త్‌ అంతర్జాతీయ టీ20ల్లో 200వ విజయాన్ని నమోదు చేసుకుంది.  

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. అభిషేక్ శర్మ (0) గోల్డెన్ డ‌కౌట్‌గా కాగా.. ఇషాన్ కిషన్ (3), సంజూ శాంసన్ (9)లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ అయ్యర్ (16) కాస్త ఫర్వాలేదనిపించడంతో ఆ మాత్రం స్కోరైనా మెన్ ఇన్ బ్లూ సాధించ‌గ‌ల్గింది. 

అనంత‌రం 33 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ చివ‌రి వ‌ర‌కు పోరాడి ఓట‌మి పాలైంది. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల నష్టానికి 30 ర‌న్స్ చేసి విజ‌యానికి రెండు ప‌రుగుల దూరంలో నిలిచిపోయింది.  వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీయ‌గా.. అక్ష‌ర్ ప‌టేల్ క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.
చదవండి: IND vs JPN: చుక్కలు చూపించిన జపాన్‌ బౌలర్లు.. టీమిండియా అత్యంత చెత్త రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement