PC: BCCI/X
సానో అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదికగా భారత్-జపాన్ మధ్య జరిగిన చారిత్రక టీ20 మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో జపాన్‌పై రెండు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌ను వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఈ మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు.
ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కేవలం 32 పరుగులు మాత్రమే చేసింది. అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ కాగా.. సంజూ శాంసన్(9), ఇషాన్ కిషన్(3), తిలక్ వర్మ(1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు.
శ్రేయస్ అయ్యర్(16) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరి ఓవర్‌లో జపాన్ విజయానికి 8 పరుగులు అవసరమవ్వగా.. అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
అక్షర్ పటేల్ తన రెండు ఓవర్ల కోటాలో వికెట్లు పడగొట్టనప్పటికి.. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. జపాన్ బౌలర్లలో కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్(12) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: IND vs JPN: చుక్కలు చూపించిన జపాన్ బౌలర్లు.. టీమిండియా అత్యంత చెత్త రికార్డు


