Photo Credit: Twitter
జపాన్‌తో జరిగిన చారిత్రక టీ20 మ్యాచ్‌లో టీమిండియా కేవలం రెండు పరుగుల తేడాతో గట్టెక్కింది. వర్షం అంతరాయంతో 5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జపాన్ బౌలర్ల ధాటికి 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. అనంతరం జపాన్ 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేయడంతో భారత్ థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది.
అయితే జపాన్ ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్‌లో హైడ్రామా నడిచింది. ఆఖరి ఓవర్‌లో జపాన్ విజయానికి 8 పరుగులు అవసరం. తొలి రెండు బంతులకు ఒక పరుగు వచ్చింది. అయితే మూడో బంతిని అక్షర్ అనూహ్యంగా వైడ్ వేయడంతో జపాన్ విజయానికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో అక్షర్ లెగ్‌సైడ్ దిశగా బంతిని వేశాడు.
క్రీజులో ఉన్న అలెగ్జాండర్ రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అంపైర్ ఆ బంతిని కూడా తొలుత వైడ్ అని ప్రకటించాడు. దీంతో అక్షర్, కీపర్ సంజూ శాంసన్‌లు షాక్‌కు గురయ్యారు. ఇది గమనించి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్క్వేర్‌లెగ్ అంపైర్ చారిస్ బ్రౌన్‌తో వాదనకు దిగాడు. అప్పటికీ ఫీల్డ్ అంపైర్ క్రిస్ థుర్గేట్ మాత్రం తన వైడ్‌కాల్‌కు కట్టుబడి ఉన్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అక్షర్.. ‘అసలు ఇదెలా వైడ్ అవుతుందో అర్థం కాలేదు’ అని శ్రేయస్‌కు సైగ చేశాడు.
దీంతో శ్రేయస్ ఫీల్డ్ అంపైర్ వద్దకు వచ్చి మరోసారి నిర్ణయంపై పునరాలోచించాలని కోరాడు. ఇద్దరు అంపైర్లు సుదీర్ఘంగా చర్చించుకొని అక్షర్ వేసిన బంతి సరైనదేనని తేల్చారు. ఆ తర్వాతి రెండు బంతులకు రెండు పరుగులు మాత్రమే రావడంతో జపాన్ ఓటమి చవిచూసింది.
మ్యాచ్‌కు డీఆర్‌ఎస్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో.. ఒకవేళ అంపైర్ తన వైడ్‌బాల్‌కు కట్టుబడి ఉంటే మాత్రం టీమిండియా కొంపమునిగేదే. కానీ సరైన సమయంలో అక్షర్, శ్రేయస్ స్పందించడంతో టీమిండియా స్వల్ప తేడాతో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మ్యాచ్ విషయానికొస్తే చార్లీ హింజ్ (2-17) అద్భుత ప్రదర్శనతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ (16) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం జపాన్ అనుభవలేమితో 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసి విజయానికి రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది.
Umpires overturning a wide decision without a review or replay, simply because Indian players asked for it.
What a low. This is more shameful than losing to Japan.pic.twitter.com/X2zhpsiSCf https://t.co/6OHZlMYcsH— Ragav X (@ragav_x) September 22, 2026
🔴 BIG CONTROVERSY BETWEEN SHREYAS IYER & UMPIRE 🤯
- Axar Patel bowled a legal delivery, but umpire called it a wide.
- Axar was angry with the umpire as it was already back-to-back wides, & Japan needed only a few runs to win.
- Shreyas Iyer then spoke to the umpire.
-… pic.twitter.com/VQtdQf6XvH— Sam (@cricsam02) September 22, 2026
ఇదీ చదవండి: టీమిండియాపై జపాన్ బౌలర్ ప్రపంచ రికార్డు


