breaking news
Wushu
-
బీఎస్ఎఫ్ అరుదైన నిర్ణయం
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో కానిస్టేబుల్ అయిన ఐదు నెలల కాలానికే మహిళా వుషు ప్లేయర్ శివాని హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందింది. బీఎస్ఎఫ్లాంటి బలగాల్లో ఉన్న జవాన్లకు ప్రమోషన్ అంత సులువు కాదు. కనీసం 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల సర్వీస్ కాలం పూర్తవ్వాలి. కానీ 21 ఏళ్ల శివాని ప్రపంచ వుషు చాంపియన్‌షిప్ సాండా ఈవెంట్ 75 కేజీల విభాగంలో భారత్‌కు రజత పతకం తెచ్చిపెట్టడంతో అరుదైన ప్రమోషన్‌కు అర్హత సాధించింది. ఈ ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లో బ్రెజిల్లో జరిగిన వుషు (చైనా మార్షల్ ఆర్ట్స్) పోటీల్లో శివాని రన్నరప్‌గా నిలువడంతో బీఎస్‌ఎఫ్‌లోకి వచ్చీరాగానే హెడ్ కానిస్టేబుల్ అయ్యింది. గురువారం బీఎస్ఎఫ్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ (డీజీ) దల్జీత్ సింగ్ చౌదరి ప్రమోషన్‌కు సంబంధించిన రిబ్బన్‌ను ఖాకీ యూనిఫామ్‌లో ఉన్న శివానికి పిన్ చేశారు. ఏళ్ల తరబడి పనిచేస్తే గానీ రాని ప్రమోషన్‌ను ఇలా కట్టబెట్టాలంటే నిబంధనల సడలింపు, ప్రత్యేక అనుమతి తప్పనిసరి. దీనికోసం బీఎస్ఎఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (డీఓపీటీ) వద్ద శాఖపరమైన అనుమతి తీసుకున్నట్లు బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ఈ జూలైలో అనూజ్ అనే కానిస్టేబుల్‌కు ఇలాంటి పదోన్నతే కల్పించారు. అతను ఏప్రిల్‌లో చైనాలో జరిగిన ప్రపంచకప్ సాండా ఈవెంట్ 52 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. 2.7 లక్షల మందితో కూడిన బీఎస్ఎఫ్ బలగాలు క్లిష్టమైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పగలనక రాత్రనక పహారా కాస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు, క్లిష్టమైన లేదంటే ప్రత్యేక పరిస్థితుల్లో కూడా అంతర్గత భద్రతా ఏర్పాట్లలోనూ బీఎస్ఎఫ్ సిబ్బంది తలమునకలై శ్రమిస్తుంటుంది. -
ఉత్తమ క్రీడాకారిణిగా రోషిబినా దేవి
-
అంతర్జాతీయ వుషు ‘ఉత్తమ క్రీడాకారిణి’గా రోషిబినా దేవి
భారత సీనియర్ వుషు క్రీడాకారిణి నరోమ్ రోషిబినా దేవికి అరుదైన గౌరవం లభించింది. 2023 సంవత్సరానికి ఈ మణిపూర్ అమ్మాయి ‘సాండా’ కేటగిరీలో ‘అంతర్జాతీయ ఉత్తమ క్రీడాకారిణి’ పురస్కారం గెల్చుకుంది. పబ్లిక్ ఓటింగ్‌లో రోషిబినాకు అత్యధికంగా 93,545 ఓట్లు లభించాయని అంతర్జాతీయ వుషు సమాఖ్య తెలిపింది. 2023 జాతీయ క్రీడా పురస్కారాల్లో ‘అర్జున’ అవార్డు గెల్చుకున్న 23 ఏళ్ల రోషిబినా 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2022 ఆసియా క్రీడల్లో రజతం సాధించింది. -
ఉషు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఉషు వరల్డ్ చాంపియన్ షిప్లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. రష్యాలో జరిగిన ఈ పోటీల్లో భారత క్రీడాకారిణి పూజా కాడియన్ 75 కేజీల విభాగం ఫైనల్లో రష్యా ప్లేయర్ ఈవ్ గేనియా స్టెపనోవాపై విజయం సాధించి స్వర్ణం పొందింది. ఈ విజయంతో ఈ క్రీడలో స్వర్ణం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా పూజా కాడియన్ గుర్తింపు పొందారు. ఇక ఈ విభాగంలో భారత్‌కు పతకం రావడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక పురుషుల 45 కేజీల విభాగంలో రమేశ్ చంద్ర సింగ్ కాంస్య పతకం గెలుపొందారు.


