
భారత సీనియర్ వుషు క్రీడాకారిణి నరోమ్ రోషిబినా దేవికి అరుదైన గౌరవం లభించింది. 2023 సంవత్సరానికి ఈ మణిపూర్ అమ్మాయి ‘సాండా’ కేటగిరీలో ‘అంతర్జాతీయ ఉత్తమ క్రీడాకారిణి’ పురస్కారం గెల్చుకుంది.
పబ్లిక్ ఓటింగ్‌లో రోషిబినాకు అత్యధికంగా 93,545 ఓట్లు లభించాయని అంతర్జాతీయ వుషు సమాఖ్య తెలిపింది. 2023 జాతీయ క్రీడా పురస్కారాల్లో ‘అర్జున’ అవార్డు గెల్చుకున్న 23 ఏళ్ల రోషిబినా 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2022 ఆసియా క్రీడల్లో రజతం సాధించింది.