
అథ్లెటిక్స్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ రెండోసారి భారత్‌కు రానున్నాడు. బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ), ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్ల మధ్య అక్టోబర్ 1న ముంబైలో జరిగే ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో బోల్ట్ బరిలోకి దిగుతాడు. తొలి అర్ధభాగం బెంగళూరు జట్టుకు, రెండో అర్ధభాగంలో ముంబై జట్టుకు బోల్ట్ ప్రాతినిధ్యం వహిస్తాడు. భారత ఫుట్‌బాలర్లతోపాటు, బాలీవుడ్, ఇతర రంగాల ప్రముఖులు ఈ మ్యాచ్‌లో బోల్ట్‌తో కలిసి సరదాగా ఆడతారు. ప్రముఖ స్పోర్ట్స్ షూ తయారీ సంస్థ ప్యూమా ఈ మ్యాచ్‌ను ఏర్పాటు చేస్తోంది.
ఈ మ్యాచ్‌కంటే ముందు బోల్ట్ సెపె్టంబర్ 26 నుంచి 28 వరకు ఢిల్లీ, ముంబైలలో పలు ప్రైవేట్ ఈవెంట్లలో పాల్గొంటాడు. ‘భారత్‌కు మరోసారి రావడానికి ఉత్సాహంతో ఉన్నాను. క్రీడల పట్ల ఇక్కడి ప్రజలకు ఎంతో మక్కువ ఉంది. భారీ సంఖ్యలో నన్ను అభిమానించే వాళ్లు కూడా ఉన్నారు’ అని 2014లో తొలిసారి భారత్‌కు వచ్చిన 39 ఏళ్ల బోల్ట్ వ్యాఖ్యానించాడు. 2017లో అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పిన బోల్ట్ ఒలింపిక్స్‌లో 8 స్వర్ణాలు, ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 11 స్వర్ణాలు, 2 రజతాలు, ఒక కాంస్యం సాధించాడు.