బెంగళూరు: ఇటీవల ప్రాణాంతకమైన తొక్కిసలాట జరిగిన బెంగళూరు చిన్నస్వామి క్రీడా మైదానంలో మళ్లీ క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించే విషయం పరిశీలనకు కమిటీని నియమించినట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. సోమవారం విధానసౌధలో క్రికెట్ సంఘం అధికారులు, పోలీసు అధికారులతో ఆయన భేటీ జరిపారు. 24న విజయ్ హజారె టోర్నీ జరపడానికి క్రికెట్ సంఘం అనుమతి కోరిందన్నారు. జీబీఏ కమిషనర్ నేతృత్వంలో పలు ప్రభుత్వ శాఖలతో కమిటీని ఏర్పాటు చేశామని, స్టేడియాన్ని పరిశీలించి మార్పులు చేర్పుల గురించి ప్రభుత్వానికి నివేదికను ఇస్తుందని, దానిని బట్టి చర్యలు తీసుకుంటామన్నారు.


