బెంగళూరు: లంచం తీసుకుంటూ బెంగళూరులోని కేపీ.అగ్రహార సీఐ గోవిందరాజు లోకాయుక్త పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాలు.. చిట్టీల విషయంపై వివాదం ఏర్పడటంతో సూరజ్ అనే వ్యక్తిని సీఐ గోవిందరాజు నిత్యం స్టేషన్‌కు పిలిపించి వేధించేవాడు. కేసునుంచి తప్పించేందుకు రూ.5 లక్షలకు డిమాండ్ చేశాడు. తొలుత రూ.లక్ష తీసుకున్నాడు. మిగతా డబ్బు కోసం డిమాండ్ చేసేవాడు. ఏసీపీకి కూడా వాటా ఇవ్వాలని, వెంటనే నగదు సమకూర్చాలని ఒత్తిడి చేశాడు. దీంతో సూరజ్ లోకాయుక్తను ఆశ్రయించాడు.
పథకం ప్రకారం సూరజ్ గురువారం చామరాజపేట గ్రౌండ్ వద్ద నగదు అందజేస్తుండగా లోకాయుక్త ఎస్‌పీ శివప్రకాష్‌దేవరాజు నేతృత్వంలో అధికారులు దాడి చేశారు. నగదు తీసుకుంటున్న సీఐని పట్టుకున్నారు. అయితే సీఐ కేకలు వేస్తూ హల్‌చల్ చేశాడు. ఆరుమంది అధికారులు అతన్ని బంధించి స్టేషన్‌కు తరలించారు. ఫిర్యాదుదారుడు సూరజ్ మాట్లాడుతూ పోలీసులు న్యాయం చేస్తారని వారిని ఆశ్రయిస్తే ఇక్కడ కూడా లంచాల కోసం గోల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. లోకాయుక్త ఎస్పీ మాట్లాడుతూ సీఐ గోవిందు నుంచి రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
A police inspector identified as Govindaraju was caught red-handed by Lokayukta for accepting a bribe of ₹4 lakh from a builder in Bengaluru !!pic.twitter.com/ZHCujV4MgV
— Aryan (@chinchat09) January 31, 2026


