రాంచీ వేదికగా జరిగిన నాలుగో దక్షిణాసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో (South Asian Athletics Championship 2025) ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన మొగలి వెంకట్రాం రెడ్డి (Mogali Venkatramreddy) సత్తా చాటాడు. 800 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ ఈవెంట్‌ను వెంకట్రాం రెడ్డి 1:52.37 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.
ఈ గేమ్స్‌లో భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు.
వెంకట్రాం రెడ్డి పతకం సాధించిన అనంతరం హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) అథ్లెటిక్స్ కోచ్ డా. జి.వి. సుబ్బారావు స్పందించారు. "ఇది దేశానికి గర్వకారణం. వెంకట్రాం రెడ్డి అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించాడు. ఇది అతని శ్రమకు ఫలితమని అన్నాడు.
వెంకట్రాం రెడ్డి ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 800 మీటర్లు, 1500 మీటర్ల ఈవెంట్లలో స్వర్ణ పతకాలు సాధించి "గోల్డెన్ డబుల్" సాధించాడు.
చదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..!


