Viral Video: ఎంతుంటే ఏంటయ్యా.. గెలిచానా లేదా..? | Tiny sumo boy, Aged 16 beats wrestler more than twice his size and age in stunning video | Sakshi
Sakshi News home page

Viral Video: ఎంతుంటే ఏంటయ్యా.. గెలిచానా లేదా..?

Nov 13 2025 12:10 PM | Updated on Nov 13 2025 1:55 PM

Tiny sumo boy, Aged 16 beats wrestler more than twice his size and age in stunning video

జపాన్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడల్లో సుమో ముందువరుసలో ఉంటుంది. ఈ క్రీడకు సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో ఓ చిన్న కుర్రాడు, ఓ మహాబలున్ని అలవోకగా ఓడిస్తాడు. సాధారణంగా సుమో పోరాటాల్లో బరువు, అనుభవం కీలకమని భావిస్తారు. 

అయితే ఈ సందర్భంలో 68 కిలోల బరువుండే ఓ 16 ఏళ్ల కుర్రాడు, 168 కిలోల బరువుండే 39 ఏళ్ల ఓ అనుభవజ్ఞుడిని సులువుగా ఓడించేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో 43 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది.

ఈ పోటీని చూసిన వారు డేవిడ్‌ వర్సెస్‌ గొలియాత్‌ పోటీగా అభివర్ణించారు. ఎంతున్నామన్నది కాదన్నయ్యా.. గెలిచామా లేదా అన్నదే ముఖ్యమని ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేశారు. ఈ పోటీలో అమమిడాకే అనే పేరుగల భారీకాయుడిపై గెలిచిన కుర్రాడి పేరు కోసే. 

కోసే.. అమమిడాకే కటౌట్‌ను చూసి బయపడకుండా, తన తక్కువ బరువునే ఆయుధంగా మలచుకొని అమమిడాకేను రింగ్‌ బయటికి కదిలించాడు. ఈ పోటీలో కోసే పాదాల కదలిక, అతని ధైర్యం అందరిని ఆకట్టుకున్నాయి. 

చదవండి: షోయబ్‌తో విడాకులు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన సానియా మీర్జా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement