అమ్మ కెనడియన్‌, నాన్న ఇటలీ..పెరిగింది ఇండియాలో..! | The musician how growing up in India shaped her life goes viral | Sakshi
Sakshi News home page

అమ్మ కెనడియన్‌, నాన్న ఇటలీ..పెరిగింది ఇండియాలో..! వైరల్‌గా సంగీతకారిణి పోస్ట్‌

Dec 26 2025 2:53 PM | Updated on Dec 26 2025 3:14 PM

The musician how growing up in India shaped her life goes viral

కొన్ని కథలు చాల గమ్మత్తుగా, ఆశ్చర్యంగా ఉంటాయి. ఎక్కడో పుట్టి, ఎక్కడ పెరిగి..విభిన్న మనుషులను కలుస్తుంటాం. అది కెరీర్‌, లేదా ఉద్యోగం వల్ల అయినా. కానీ కొందరు విదేశీయలును పెళ్లాడి..మళ్లీ వాళ్ల పిల్లల్ను మరో దేశంలో పెంచిన కొన్ని స్టోరీలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. అలాంటి సరదా స్టోరీనే షేర్‌ చేసింది ఓ విదేశీయురాలు. ఇది ఆమె కథనే. కానీ రెండు వేర్వురు దేశాలకు చెందని పేరెంట్స్‌కి పుట్టిన ఆమె చిరుప్రాయంలో మన భరత గడ్డపై అడుగుపెట్టిన కథ ఆద్యంతం మనసుకు హత్తకునేలా అందంగా ఉంది. 

బాలికి చెందిన సంగీతకారిణి బియాంక నీడు తన బాల్యమంతా భారత్‌లోనే సాగిందంటూ తన స్టోరీని షేర్‌ చేసుకుంది. ఆ పోస్ట్‌లో నీడు ఇలా రాసుకొచ్చారు. కెనడియన్‌ తల్లి, ఇటాలియన్‌ తండ్రికి జన్మిచిన ఆమె మూడు నెలల వయసుకుకే భారత్‌కి వచ్చినట్లు పేర్కొంది. 16వ ప్రాయం వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత లండన్‌, బాలికి వెళ్లినట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు క్యాథీ నీడు, రాబర్టో నీడు భారత్‌లోని కలుసుకున్నారని, ఇక్కడే ప్రేమలో పడ్డారని చెప్పుకొచ్చింది.

చివరికి ఇక్కడే ఒక ఇల్లు కొనుక్కుని స్థిరనివాసం ఉన్నారని చెప్పుకొచ్చింది. తన చైల్డ్‌హుడ్‌ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..తన బాల్యంలో అజిల్‌ భవన్‌లో జరుపుకున్న హోలిపండుగ గురించి చెప్పుకొచ్చింది. ప్రతి ఏడాది అక్కడకు వెళ్లి హోలీ ఆడటం బాగా నచ్చేదని, అక్కడే పార్టీలు కూడా చేసుకునేవాళ్లమని తెలిపింది. అంతేగాదు ఈ పోస్ట్‌కి తాను తల్లిదండ్రులతో భారత్‌లో గడిపిన కొన్ని బాల్య జ్ఞాపకాలకు సంబంధించిన వీడియోని కూడా జత చేసి మరి పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్‌ని చూసి చాలామంది నెటిజన్లు అద్భుతం, మీరు చాలా గ్రేట్‌ మీకు చాలా భాషలు వచ్చి ఉండొచ్చే అంటూ కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.

జీవితమే మారిపోయింది.. 
కాగా, బియాంకా నీడు తాను భారత్‌లో పెరగడం వల్ల తన లైఫ్‌ అద్భుతంగా మారిందని కూడా పేర్కొంది. భారత్‌లోని సంభాషణలు కారణంగా అప్యాయత, ఉదారతలు నేర్చుకున్నా, అలాగే ఆతిథ్యం అంటే ఏంటో తెలసుకున్నానని అంటోంది. అంతేగాదు అందరితో కలుపుగోలుగా ఉండాలో తెలిసింది. 

జీవితం అంటే మనం ఒక్కరమే కాదని, అందరితో కలిసి ఉండటం అని తెలిసింది అంటోంది. చివరగా పోస్ట్‌లో తాను ఇక్కడ పెరగడం వల్లే ప్రపంచంలో ఎలా జీవించాలో, ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలో తెలుసుకున్నా అని సంతోషంగా చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవ్వడమే కాదు, నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది కూడా.  

 

(చదవండి: పిల్లలు విలువలు నేర్చుకోవాలంటే భారత్‌ బెస్ట్‌..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్‌)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement