source: X
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ మహిళల జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన ల్యూక్ విలియమ్స్‌ను నియమించింది. ఇప్పటివరకు కోచ్‌గా వ్యవహరించిన లిసా కైట్లీ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నాడు. కైట్లీ కేవలం ఒక్క సీజన్ తర్వాతే పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం.
46 ఏళ్ల ల్యూక్ విలియమ్స్‌కు కోచింగ్‌లో మంచి అనుభవం ఉంది. 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మహిళల జట్టుకు కోచ్‌గా వ్యవహరించి డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను అందించాడు. అడిలైడ్ స్ట్రైకర్స్‌కు కూడా కోచ్‌గా వ్యవహరించిన ఆయన.. 2022-23 సీజన్‌లో ఆ జట్టుకు తొలి ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) టైటిల్ అందించాడు. 2025 నుంచి ఇంగ్లండ్ మహిళల జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా సేవలందించాడు.
ముంబైని మళ్లీ ఛాంపియన్‌గా నిలపడమే లక్ష్యం
రెండుసార్లు డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌కు 2026 సీజన్ నిరాశ మిగిల్చింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పరిమితమైంది. దీంతో కొత్త కోచ్ మార్గదర్శకత్వంలో తిరిగి విజయాల బాట పట్టాలని ముంబై భావిస్తోంది.
ఇదీ చదవండి: ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రికార్డు బ్రేకింగ్ ప్రదర్శన


