ఆస్ట్రేలియాతో మ్యాచ్‌.. విజ‌యం దిశ‌గా భార‌త్‌ | Padikkal, Kushagra set Australia A big fourth-innings target | Sakshi
Sakshi News home page

IND vs AUS: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌.. విజ‌యం దిశ‌గా భార‌త్‌

Sep 24 2026 6:54 PM | Updated on Sep 24 2026 7:04 PM

Padikkal, Kushagra set Australia A big fourth-innings target

PC: BCCI/X

పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్‌-ఎ జట్టు పట్టు బిగించింది. 363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ జట్టుకు భారత బౌలర్లు షాకిచ్చారు. స్పిన్నర్‌ తనుష్‌ కొటియన్‌, పేసర్ తుషార్‌ దేశ్‌పాండేలు ఆసీస్ ఓపెనర్లు సామ్ కాన్‌స్టాస్ (20), క్యాంప్‌బెల్ కెల్లవే (0)లను పెవిలియన్‌కు పంపారు.

దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నాథన్‌ మెక్‌స్వీనీ (23), పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (0) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే మిగతా 8 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. భారత బౌలర్ల జోరు చూస్తుంటే ఆసీస్‌ను ఆలౌట్‌ చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

అంతకుముందు భారత్‌-ఎ తమ రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ 39 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ దేవదత్‌ పడిక్కల్‌ అర్ధ శతకంతో (88 బంతుల్లో 59) రాణించాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించడంతో పడిక్కల్‌ సేన ప్రత్యర్థి ముందు అద్భుతమైన లక్ష్యాన్ని ఉంచగలిగింది. 

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 334 పరుగులు చేయగా.. దానికి సమాధానంగా పర్యాటక జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.
చదవండి: సౌతాఫ్రికా ప్లేయర్‌ ప్రపంచ రికార్డు.. కోహ్లి, సచిన్‌కూ సాధ్యం కాలేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement