PC: SA Twitter
డర్బన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే అద్భుత సెంచరీతో చెలరేగాడు. టాపార్డర్ విఫలమైన చోట బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడుతూ, వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించిన బ్రీట్జ్కే.. సరిగ్గా 100 బంతుల్లో తన రెండో వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 106 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఈ వీరోచిత శతకం సాధించే క్రమంలో బ్రీట్జ్కే ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో మొదటి 14 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. తన తొలి 14 ఇన్నింగ్స్‌లలోనే అతడు ఏకంగా 822 పరుగులు సాధించాడు.
అంతకుముందు ఈ ప్రపంచ రికార్డు పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ పేరిట ఉండేది. ఇమామ్ తన తొలి 14 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 759 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌లో 63 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇమామ్ రికార్డును ఈ సఫారీ సూపర్ స్టార్ బ్రేక్ చేశాడు. కాగా ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాలేదు. కోహ్లి తన తొలి 14 వన్డే ఇన్నింగ్స్‌లలో 468 పరుగులు చేయగా.. సచిన్ కేవలం 277 రన్స్ మాత్రమే చేశాడు.
ఇక ఈ మ్యాచ్‌లో బ్రీట్జ్కేతో పాటు ఆల్‌రౌండర్ మార్కో జానెసన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 59 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 పరుగులు చేశాడు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లీస్ మూడు, ఆడమ్ జంపా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: ఆల్‌టైమ్ టీ20 జట్టు ఇదే.. రోహిత్‌కు నో ఛాన్స్! భారత్ నుంచి ముగ్గురే?


