PC: BCCI/ipl
అబుదాబి టీ10 లీగ్-2026 (10వ సీజన్)కు ముందు కొత్త ఫ్రాంచైజీ 'రాయల్ డెసర్ట్ ఛాంపియన్స్' కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా వెస్టిండీస్ వికెట్ కీపర్-బ్యాటర్ నికోలస్ పూరన్‌ను నియమిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. గత సీజన్‌లో పూరన్ 'డెక్కన్ గ్లాడియేటర్స్' జట్టుకు నాయకత్వం వహించాడు.
అయితే, అతడి సారథ్యంలో జట్టు ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించకపోవడంతో గ్లాడియేటర్స్ యాజమాన్యం పూరన్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన 'రాయల్ డెసర్ట్' అతడిపై నమ్మకంతో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
ఇక ప్లాటినం కేటగిరీ కింద పూరన్‌తో పాటు ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ ఫిల్ సాల్ట్, విండీస్ ఆల్ రౌండర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌లతో రాయల్ డెసర్ట్ ఛాంపియన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా, భారత మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్‌ను టీమ్ డైరెక్టర్‌గా నియమించింది. కాగా, అబుదాబి టీ10 లీగ్ పదో సీజన్ నవంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: సౌతాఫ్రికా ప్లేయర్ ప్రపంచ రికార్డు.. కోహ్లి, సచిన్‌కూ సాధ్యం కాలేదు!


