Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో లక్నో జట్టు డబుల్ హ్యాట్రిక్ ఓటములకు చెక్ పెట్టినట్లయింది. అయితే లక్నో ఇన్నింగ్స్ సమయంలో బ్యాటర్ నికోలస్ పూరన్, ఆర్సీబీ బౌలర్ కృనాల్ పాండ్యా మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది.
కృనాల్ విసిరిన బౌన్సర్‌ను లాంగ్ ఆన్ దిశగా ఆడి సింగిల్ తీశాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌కు చేరుకున్న పూరన్‌తో కృనాల్ మాటల యుద్ధానికి దిగాడు. ఇద్దరూ సీరియస్‌గా ఒకరినొకరు చూసుకోవడం కనిపించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవడం కనిపించింది. ఈ నేపథ్యంలో పూరన్ కృనాల్ కాలర్‌ను పట్టుకొని నెట్టివేయడం కనిపించింది.
కానీ ఆ తర్వాత ఈ ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకోవడంతో వివాదం సమసిపోయింది. దీనికి సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా పూరన్ తన కాలర్ ఎందుకు పట్టుకోవాల్సి వచ్చిందో, అసలు పూరన్‌తో గొడవేంటనే విషయాన్ని కృనాల్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వివరణ ఇచ్చుకున్నాడు.
‘ఇద్దరి మధ్య గొడవేం లేదు. కేవలం మా మాధ్య ఉన్నది ప్రేమ మాత్రమే. 100 ఐపీఎల్ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న నా సోదరుడు నికోలస్ పూరన్‌కు అభినందనలు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. లక్నో ఇన్నింగ్స్ సమయంలో నేను పూరన్ అడిగింది ఏంటో తెలుసా?.. ‘ నా బౌన్సర్ ఎలా ఉంది’ అని అడిగాను. అంతకుమించి మా మధ్య ఏం జరగలేదు’ అని చెప్పుకొచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే వర్షం అంతరాయంతో 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ సెంచరీతో చెలరేగగా, పూరన్ (38), పంత్ (32 నాటౌట్) రాణించారు. అనంతరం 213 పరుగుల రివైజ్డ్‌టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులకు పరిమితమైంది.
పటీదార్ (61), పడిక్కల్ (34) రాణించగా, ఆఖర్లో టిమ్ డేవిడ్ (40), కృనాల్ (28 నాటౌట్), షెపర్డ్ (23 నాటౌట్) ధాటిగా ఆడినా ఆర్సీబీని గెలిపించలేకపోయారు. ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించాడు.
Things are heating up in this Revenge Week clash! 🔥
A contest within the contest is brewing between #NicholasPooran and #KrunalPandya! 👀#TATAIPL Revenge Week 2026 ➡️ #LSGvRCB | LIVE NOW 👉 https://t.co/gEprGnf2A7 pic.twitter.com/C2oqmrYF0X— Star Sports (@StarSportsIndia) May 7, 2026
Nicholas Pooran and Krunal Pandya having a friendly banter? 😳 pic.twitter.com/hyYoj2J0d7
— Deepu (@deepu_drops) May 8, 2026


