మరో గెలుపుపై గురి | Indias second ODI against New Zealand today | Sakshi
Sakshi News home page

మరో గెలుపుపై గురి

Nov 7 2026 3:57 AM | Updated on Nov 7 2026 3:57 AM

Indias second ODI against New Zealand today

నేడు న్యూజిలాండ్‌తో భారత్‌ రెండో వన్డే

జోరు మీదున్న టీమిండియా

మ్యాచ్‌కు వర్షం గండం

ఉదయం గం. 7:30 నుంచి సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్‌ యాప్‌లో ప్రసారం

వెలింగ్టన్‌: తొలి వన్డేలో పదునైన పేస్‌ బౌలింగ్‌తో పైచేయి సాధించిన భారత జట్టు ఇప్పుడు మరో గెలుపుపై గురి పెట్టింది. నేడు హెన్రీ స్టేడియంలో జరిగే రెండో వన్డేలో భారత్, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. గత మ్యాచ్‌లో విజయాన్ని అందించిన జట్టునే టీమిండియా కొనసాగించే అవకాశం ఉండగా... గాయంతో కాన్వే పూర్తిగా సిరీస్‌కు దూరం కావడంతో కివీస్‌ వద్ద కూడా మరో ప్రత్యామ్నాయం లేదు. 

ప్రపంచంలో ‘అత్యంత వేగంగా గాలులు వీచే నగరం’గా గుర్తింపు ఉన్న వెలింగ్టన్‌లో ఇప్పుడు గాలికి తోడు మ్యాచ్‌ సమయంలో వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. భారీ వర్షంతో శుక్రవారం ఇరు జట్ల ప్రాక్టీస్‌ ఇండోర్‌కు మారింది. దీంతో పాటు గత మ్యాచ్‌తో పోలిస్తే ఇక్కడి మైదానంలో వికెట్‌కు ఇరు వైపులా చిన్న బౌండరీలు, నేరుగా ఉండే బౌండరీలు చాలా పెద్దవి. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ బౌలర్లు తమ వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంది.  

శ్రేయస్‌ సత్తా చాటేనా! 
శుక్రవారం తన 38వ పుట్టిన రోజు జరుపుకున్న విరాట్‌ కోహ్లి ఎప్పటిలాగే అమితోత్సాహంతో మరో మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. గత మ్యాచ్‌ తరహాలోనే అతను తన స్థాయిని ప్రదర్శిస్తే జట్టుకు తిరుగుండదు. కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కూడా మెరుగైన ప్రదర్శన కనబర్చగా, రోహిత్‌ తొలి మ్యాచ్‌ వైఫల్యాన్ని మరచి మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయితే అన్నింటికి మించి నాలుగో స్థానంలో శ్రేయస్‌ బ్యాటింగ్‌ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. గత 10 వన్డేల్లో ఒక అర్ధసెంచరీనే చేసిన అతను తొలి వన్డేలో షార్ట్‌ బంతులకు పూర్తిగా తడబడ్డాడు.

సుదీర్ఘ కాలంగా ఈ బలహీనతను అతను అధిగమించలేకపోతున్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌ దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే జరిగే నేపథ్యంలో అతను సత్తా చాటాల్సి ఉంది. మిడిలార్డర్‌లో రాహుల్‌తో పాటు ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్, నమన్‌ ధీర్‌ కీలకం కానున్నారు. తుది జట్టులో నలుగురు పేసర్లు కంబోజ్, గుర్నూర్, అర్‌‡్షదీప్, ఆకిబ్‌ నబీ ఖాయం. భారత్‌ ‘ఎ’ మ్యాచ్‌ పూర్తి కావడంతో సిరాజ్‌ అందుబాటులో వచి్చనా...ఇతర పేసర్ల బ్యాటింగ్‌ కారణంగా ప్రాధాన్యతా క్రమంలో అతను వెనుకబడినట్లుగా కనిపిస్తోంది.  

మార్పుల్లేకుండా... 
ఆక్లాండ్‌ వన్డేలో కివీస్‌ పేలవమైన బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చింది. ఏ ఒక్కరూ కూడా పట్టుదలగా నిలిచి స్కోరు సాధించలేకపోయారు. సిరీస్‌లో 0–2తో వెనుకబడకుండా ఉండాలంటే జట్టు బ్యాటింగ్‌ ఎంతో మెరుగవ్వాల్సి ఉంది. ఓపెనర్లు యంగ్, సీఫెర్ట్‌ శుభారంభం అందిస్తే తర్వాతి బ్యాటర్లపై భారం తగ్గుతుంది. కాన్వే లేకపోవడంతో అవకాశం దక్కించుకున్న నికోల్స్‌ ఈసారి ఎలా ఆడతాడో చూడాలి. 

భారత్‌పై మంచి రికార్డు ఉన్న మిచెల్, లాథమ్‌ల నుంచి పెద్ద ఇన్నింగ్స్‌లను మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. ఇటీవలి ప్రదర్శనతో ఫిలిప్స్‌పై మరింత బాధ్యత పెరిగింది. సొంతగడ్డపై పేస్, స్వింగ్‌తో రాణించగలరని నలుగురు పేసర్లు స్మిత్, జేమీసన్, డఫీ, టిక్నర్‌లపై జట్టు నమ్మకం ఉంచింది. వీరు భారత్‌ బలమైన బ్యాటింగ్‌ను ఎలా నిలువరిస్తారనేది ఆసక్తికరం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement