IND VS NZ 2nd ODI: బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌.. 47 ఓవర్ల మ్యాచ్ | IND VS NZ 2nd ODI Updates | Sakshi
Sakshi News home page

IND VS NZ 2nd ODI: బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌.. 47 ఓవర్ల మ్యాచ్

Nov 7 2026 7:49 AM | Updated on Nov 7 2026 8:10 AM

IND VS NZ 2nd ODI Updates

source: X

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌.. 47 ఓవర్ల మ్యాచ్
భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నారు. తడి ఔట్‌ ఫీల్డ్‌ కారణంగా ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. 

తుది జట్లు..
న్యూజిలాండ్: విల్ యంగ్, టిమ్ సీఫెర్ట్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(w), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్(c), నాథన్ స్మిత్, కైల్ జామీసన్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(సి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్

7:47 AM- భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య వెల్లింగ్టన్‌ వేదికగా ఇవాళ జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్‌ ఆలస్యమవుతుంది. తడి ఔట్‌ ఫీల్డ్‌ కారణంగా ఇంకా టాస్‌ కూడా పడలేదు. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌ ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టాస్‌ 8 గంటలకు పడుతుంది. మ్యాచ్‌ 8:30 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  ఓవర్ల కోత ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది.

కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆక్లాండ్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

ఇదీ చదవండి: టెస్ట్ క్రికెట్‌కు మహ్మద్ షమీ గుడ్ బై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement