సెలెబ్రిటీలైనా సరే.. వాళ్లూ మనలాంటి మనుషులే. పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, మానసిక ఆందోళనలు వాళ్లనూ ఇబ్బంది పెడుతుంటాయి. ఆ ఒత్తిడిని కొంతమంది కోపంతో చూపిస్తే.. మరికొందరు ఎదుటివారిపై అరుస్తారు. ఇంకొందరు చేయి కూడా చేసుకుంటారు. కానీ ఓ నటి మాత్రం వీటన్నింటికీ భిన్నం. కోపం వస్తే ఏకంగా మనుషులపైనే పడి కొరుకుతుందట! అసలు ఆ నటి ఎవరు? ఆమె అలా ప్రవర్తించడం వెనుక కారణమేంటి?
హాలీవుడ్ నటి సెల్మా బ్లెయిర్ ఇటీవల విమానంలో ప్రయాణించారు. లాస్ ఏంజెలెస్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కారు. కాసేపటి తర్వాత విమానంలో వీరంగం సృష్టించారు. ఏమైందో ఏమో.. ఒక్కసారి సిబ్బందిని కొట్టడంతో పాటు ఓ వ్యక్తిని గట్టిగా కొరికేశారు. విమానం దిగిన తర్వాత కూడా ఆమె ఇలానే వింతగా ప్రవర్తించారు. అదుపు చేసేందుకు వచ్చిన పోలీసు అధికారతో పాటు ఆస్పత్రి నర్సుపై కూడా దాడి చేశారు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
(చదవండి: 'అందుకే అప్పుడలా మాట్లాడా.. నటుడితో డేటింగ్‌పై శోభిత')
ఒత్తిడితో అలా కొరికేశారు..
ఆ సమయంలో సెల్మా మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, అందుకే సిబ్బందిపై దాడి చేసింది ఆమె తరపున న్యాయవాది కోర్డుకు వివరించాడు. ‘ విరామం లేకుండా ఎక్కువ గంటలు పనిచేయడం, అలసటతో పాటు విమానంలో తలకు గాయం కావడంతో ఆమె అలా ప్రవర్తించిందని.. ఉద్దేశపూర్వకంగా ఆమె దాడి చేయలేదని వాదించారు. దీనిపై వచ్చే ఏడాది జనవరి 19న విచారణ జరగనుతంది.
గతంలో పలువురి కొరికేసిన సెల్మా
అయితే సెల్మా ఇలా ఓ వ్యక్తిని కొరకడం కొత్తేమి కాదు. గతంలోనూ పలువురు సెలెబ్రెటీలను కొరికినట్లు స్వయంగా ఆమెనే వెల్లడించింది. తను రాసిన పుస్తకంలో విపరీతమైన ఒత్తిడికి లోనైనప్పుడు అలా కొరికేస్తానని రాసుకొచ్చింది. ‘క్రూయల్ ఇంటెన్షన్స్’, ‘లీగల్లీ బ్లాండ్’, ‘హెల్‌బాయ్’ వంటి చిత్రాలతో సెల్మా బ్లెయిర్ మంచి గుర్తింపు సంపాదించుకుంది.


