మిస్ ఇండియా యుఎస్ఏ 2014గా ప్రణతి గంగరాజు | Pranathy Gangaraju crowned Miss India USA 2014 | Sakshi
Sakshi News home page

మిస్ ఇండియా యుఎస్ఏ 2014గా ప్రణతి గంగరాజు

Dec 18 2014 4:05 PM | Updated on Sep 2 2017 6:23 PM

జార్జియాలో నివాసం ఉంటున్న తెలుగమ్మాయి ప్రణతి గంగరాజు ప్రతిష్ఠాత్మమైన మిస్ ఇండియా యుఎస్ఏ 2014 టైటిల్ గెలుచుకుంది.

వాషింగ్టన్: జార్జియాలో నివాసం ఉంటున్న తెలుగమ్మాయి ప్రణతి గంగరాజు ప్రతిష్ఠాత్మమైన మిస్ ఇండియా యుఎస్ఏ 2014 టైటిల్ గెలుచుకుంది. సినిమా నటన, నిర్మాణంలో కోర్సు చేస్తున్న 19 ఏళ్ల ప్రణతికి నృత్యం, పాటలు పాడటం, రాయడం, ఈత లాంటి హాబీలున్నాయి. న్యూయార్క్ ప్రాంతానికి చెందిన ఐఎఫ్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇంతకుముందు ఈ టైటిల్ గెలుచుకున్న మోనికా గిల్.. ఈసారి విజేత ప్రణతికి కిరీటం అలంకరించింది. 2016 జూన్ నెలలో గోవాలో జరిగే కార్యక్రమంలో మరోసారి ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఈ పోటీలలో ఫ్లోరిడాకు చెందిన మోనికా షా (24), హవాయికి చెందిన ఏంజెలా నంద్ (27)లకు వరుసగా రెండు, మూడు స్థానాలు లభించాయి. అమెరికాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మొత్తం 21 మంది భారత సంతతి అమ్మాయిలు ఈ అందాల పోటీలో పాల్గొన్నారు. న్యూజెర్సీకి చెందిన రియా కౌర్కు మిస్ టీన్ ఇండియా అమెరికా టైటిల్ లభించింది. మిస్ ఇండియా అమెరికా పోటీలో పాల్గొనేవాళ్లు 17-27 ఏళ్ల మధ్యవారై ఉండాలి, పెళ్లి చేసుకుని ఉండకూడదు, తాము ప్రాతినిధ్యం వహించే దేశానికి చెందినవాళ్లై ఉండాలి.  ప్రధానంగా వీరికి నాలుగు అంశాల్లో పోటీ పెడతారు. ఈవెనింగ్ గౌన్, ఇండియన్ డ్రస్, టాలెంట్, ప్రశ్న-జవాబులు ఈ అంశాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement