సాక్షి, క్రైమ్: ఎన్డీఆర్ జిల్లా నందిగామ శివారులో గత అర్ధరాత్రి బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీ కొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందిగామ ఆస్పత్రికి తరలించారు. వీళ్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
నందిగామ బైపాస్ అనాససాగరం వద్ద ఫ్లై ఓవర్‌పై కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న మరో లారీని బస్సు ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. 35 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు వెళ్తోంది. ప్రమాద తీవ్రతకు బస్సు ఎడమ భాగం నుజ్జునుజ్జు అయ్యింది.


