సాక్షి, అల్లూరి జిల్లా: ఏపీలో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలిసింది.
వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లాలోని ఏజెన్సీలో మావోయిస్టులు ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. బుధవారం ఉదయం మారేడుమిల్లి మండలం జీఎంవలస సమీపంలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బుధవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో శ్రీకాకుళానికి చెందిన ఆంధ్ర, ఒడిస్సా ఇంఛార్జ్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతి చెందారు. వెపన్స్ డీలింగ్‌లో శంకర్‌ది కీలక పాత్ర. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఇక.. ఈ ఎన్‌కౌంటర్‌ను ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా మీడియా సమావేశం సందర్బంగా ధృవీకరించారు.
ఏడుగురు మృతులు వీరే..
1. మెట్టూరి జోగా రావు @ టెక్ శంకర్ @ శంకర్.. బతుపురం (v), వజ్రపు కొత్తూరు (M), శ్రీకాకుళం. SZCM, ఇంఛార్జ్ AOB
2. జ్యోతి @ సరిత, DVCM, (గతంలో నంబాల కేశవ రావు @ BR దాదా మాజీ మావోయిస్టు చీఫ్‌కి గార్డ్ కమాండర్‌గా పనిచేశారు) 32 సంవత్సరాలు, n/o బూర్గులంక ప్రాంతం (కిస్టారం ప్రాంతం), సుక్మా జిల్లా.
3. సురేష్ @ రమేష్, ACM (గతంలో జగరగొండ LOS, SBT DVC & ఎర్రా SZCM కమ్యూనికేషన్ టీమ్‌లో పనిచేశారు).
4. లోకేష్ @ గణేష్, ACM (గతంలో జగరగొండ ఏరియా మిలీషియా కమాండర్, SBT DVC & కటకం సుదర్శన్ @ ఆనంద్ దాదాకు గార్డుగా పనిచేశారు).
5. సైను @ వాసు, ACM (గతంలో జగరకొండ LOS, SBT DVC యొక్క Dy. కమాండర్‌గా పనిచేశారు).
6. అనిత, ACM (గతంలో జగరగొండ LOS, SBT DVCలో పనిచేశారు).
7. షమ్మీ ACM (గతంలో జగరగొండ LOS, SBT DVCలో పనిచేశారు)..



