కూటమి ఎమ్మెల్యేపై జనసేన నేత బాలినేని ఫైర్‌ | Jana Sena Leader Balineni Fires On MLA Janardhan Over Alleged Land And Mining Irregularities, More Details Inside | Sakshi
Sakshi News home page

కూటమి ఎమ్మెల్యేపై జనసేన నేత బాలినేని ఫైర్‌

Feb 27 2026 5:59 PM | Updated on Feb 27 2026 6:13 PM

Jana Sena Leader Balineni Fires On MLA Janardhan

ప్రకాశం: ఒంగోలులో కూటమి నేతల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌పై జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు.  ఒంగోలులో భూకబ్జాలు, అక్రమాలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే జనార్థన్‌ కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్‌, ఇసుక రవాణా జరుగుతుందన్నారు. ఎక్కడపడితే అక్కడ భూకబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే జనార్థన్‌ దందాలను ప్రశ్నిస్తూనే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు.

ఒంగోలులో భూకబ్జాలు,అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మెప్మాలో అవినీతి కారకులెవరో తేల్చాని బాలినేని డిమాండ్‌ చేశారు. గతంలో భూ అక్రమాలపై తాను మంత్రిగా వున్నప్పుడు సిట్ వేశానని, ఇవాళ వివాదం ఉన్న రెండు పార్టీలను పిలిచి రాజీ చేసి సొమ్ము చేసుకుంటున్నారని  మండిపడ్డారు. ఒంగోలులో   దామచర్ల జనార్దన్ పేరు చెపితే ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారన్నారు. ఇసుక. మైనింగ్  అక్రమ రవాణా అంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తున్నాయని అగ్రహం వ్యక్తం చేశారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement