‘చంద్రబాబు కల్తీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు’ | YSRCP Leader Kurasala Takes On AP Govt | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు కల్తీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు’

Feb 27 2026 5:41 PM | Updated on Feb 27 2026 5:43 PM

YSRCP Leader Kurasala Takes On AP Govt

కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్తీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు.. కల్తీ ప్రభుత్వాన్ని మాత్రం నడుపుతున్నారని విమర్శించారు. వ్యవసాయంపై ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీలో మాట్లాడలేదంటేనే సర్కార్‌ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుందన్నారు. 

చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాజమండ్రిలో కల్తీ పాలు,  శ్రీకాకుళంలో కల్తీ నీళ్లు అన్నట్లుగా చంద్రబాబు సర్కార్‌ పనితీరు ఉందని విమర్శించారు. కల్తీ పాలతో ప్రాణాలు పోతుంటే టీడీపీ ఎమ్మెల్యేలు క్రికెట్‌ ఆడుతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement