విజయవాడ: అల్లరి అంటే గుర్తొచ్చేది కోతి.. పిల్లలు ఎవరైనా బాగా ఎగురుతూ.. గొడవ చేస్తుంటే ‘వీడి కోతి చేష్టలు తట్టుకోలేకపోతున్నాం రా బాబు’ అని అంటుంటాం.. ఎందుకంటే కోతులు ఒక్కచోట కుదురుగా కూర్చొని ఉండలేవు. వాటి స్వభావమే అంత. అయితే ఈ ఫొటో చూడండి. ఇవేమి సర్కస్‌లో ట్రెయిన్డ్ కోతులు కావు. అవి నటించడం లేదు. వాటికేమైందో గానీ నిశ్శబ్దంగా పరధ్యానంలో ఉండిపోయాయి. తల్లి కోతి ఒడిలో పిల్లలు ఒదిగిపోతే.. పక్కనే మరో కోతి నిరాశగా కూర్చుండిపోయింది. వీటి భావోద్వేగం ఏమిటో అర్థం కాక అక్కడ ఉన్న వారు ఏదో వింతను చూస్తున్నట్లు ఫొటోలు తీసుకున్నారు. విజయవాడ బందరు లాకుల వద్ద గోడపై కనిపించిన ఈ దృశ్యాన్ని సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది.


