Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP HC Verdict on Pinnelli Ramakrishna Reddy Bail Petition
పిన్నెల్లి బెయిల్‌పై నేడే తీర్పు

సాక్షి, విజయవాడ: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై నేడు(మంగళవారం) ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. నిన్నటి వాదనలలో పోలీసుల కుట్రలు బట్టబయలు అయ్యాయి. పిన్నెల్లి విషయంలో పోలీసుల తీరు రోజురోజుకి దిగజారుతోంది. పిన్నెల్లి కౌంటింట్‌లో పాల్గోకుండా పోలీసులతో కలిసి పచ్చముఠా కుట్ర పన్నుతోంది. ఈవీఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23న హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లిపై పోలీసులు మరో మూడు కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్‌కి హైకోర్టుని మరోసారి పిన్నెల్లి ఆశ్రయించారు. హైకోర్టు విచారణలో మూడు కేసులని మే 22న‌ నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. చదవండి: చంద్రబాబు సేవలో బదిలీ బలగాలు!హైకోర్టు తీర్పు తర్వాతే 23న తప్పుడు కేసులు నమోదు చేశారని పిన్నెల్లి న్యాయవాది తెలిపారు. రికార్డులు పరిశీలించడంతో రికార్డులు తారుమారు చేసినట్లు బయడపడింది. మే 23న కేసులు నమోదు చేసి 24న స్ధానిక మేజిస్డ్రేట్‌కు తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదు చేశారు. హైకోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. మరోవైపు ప్రభుత్వ జీఓ లేకుండా పోలీసుల తరపున ప్రైవేట్ న్యాయవాది అశ్వినీకుమార్ వాదించారు. తొలిరోజు వాదనలు వినిపించి రెండవ రోజు వాదనలకి అశ్వినీకుమార్ గైర్హాజరయ్యారు. ఆసక్తికరంగా బాదితుల తరపున టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు ఇంప్లీడ్ పిటీషన్ వేసి వాదనలు వినిపించారు.

It was my fathers dream to become a cricketer: Rishabh Pant
క్రికెట‌ర్ కావాల‌న్న‌ది మా నాన్న క‌ల‌.. చాలా సంతోషంగా ఉంది: పంత్‌

టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ త‌న రీ ఎంట్రీలో స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 14 నెల‌ల త‌ర్వాత తిరిగి మైదానంలో అడ‌గుపెట్టిన రిష‌బ్‌.. ఐపీఎల్‌-2024లో అద‌రగొట్టాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు సార‌థ్యం వహించిన‌ పంత్‌.. ఆ జ‌ట్టు త‌ర‌పున లీడింగ్ ర‌న్ స్కోర‌ర్‌గా నిలిచాడు.ఈ ఏడాది సీజ‌న్‌లో ఓవ‌రాల్‌గా 13 మ్యాచ్‌లు ఆడిన‌ పంత్‌.. 40.55 సగటుతో 446 పరుగులు చేశాడు. పున‌రాగ‌మ‌నంలో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన పంత్‌కు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2024 భార‌త జ‌ట్టులో సైతం సెల‌క్ట‌ర్లు ఛాన్స్ ఇచ్చారు. ఇప్ప‌టికే అమెరికాకు చేరుకున్న ఈ ఢిల్లీ డైన‌మెట్‌.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌న‌కు సన్న‌ద్దమవుతున్నాడు. ఈ క్ర‌మంలో త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు శిఖ‌ర్ ధావ‌న్ టాక్ షో 'ధావన్ కరేంగే'లో రిష‌బ్ పాల్గోనున్నాడు. ఈ షోలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలను పంత్ పంచుకున్నాడు. త‌న‌ను క్రికెట‌ర్‌గా చూడాల‌న్న త‌న తండ్రి క‌ల‌ను నేర‌వేర్చినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని పంత్ చెప్పుకొచ్చాడు. నేను క్రికెటర్ కావాలనేది మా నాన్న కల. మా నాన్న క‌ల‌ను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు క్రికెటర్‌ని కావాలని నిర్ణయించుకున్నాను. మా నాన్న నాకు 14వేల విలువైన బ్యాట్‌ని బహుమతిగా ఇచ్చాడు. అయితే మా అమ్మ‌కు మాత్రం చాలా కోపం వ‌చ్చింది అంటూ న‌వ్వుతూ" పంత్ పేర్కొన్నాడు.

Lakshmi Parvathi Pay Tribute To NTR 101 Birth Anniversary
జగన్‌కు ఎన్టీఆర్‌ ఆశీస్సులున్నాయి: లక్ష్మీపార్వతి

హైదరాబాద్‌, సాక్షి: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 101వ జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్సార్‌సీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మంచి పరిపాలనే నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్‌ జగన్‌కు ఎన్టీఆర్‌ ఆశీస్సులు ఉన్నాయి. జూన్‌ 4 తర్వాత జగన్‌ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుంది’’ అని అన్నారామె. అంతకు ముందు.. మనవళ్లు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌లు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్‌ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.ఇదీ చదవండి: మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం!

Liquor Policy Scam MLC Kavitha Bail Petition Hearing Updates
కవిత లిక్కర్‌ కేసు: నేడు ఈడీ, సీబీఐ కౌంటర్‌ వాదనలు

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ( మంగళవారం) ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించనున్నారు. నిన్న(సోమావారం) కవిత తరపున ముగిసిన వాదనలు ముగిశాయి. ఇవాళ ఈడీ, సీబీఐ వాదనలు వినిపించనున్నారు. ఈడీ, సీబీఐ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తామని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. సీబీఐ, ఈడీ దర్యాప్తుకు సహకరించిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘కవిత అరెస్టు చట్టబద్ధంగా జరగలేదు. తనకు మైనారిటీ తీరని పిల్లలు ఉన్నారు. మహిళా అనే కోణంలో బెయిల్ ఇవ్వాలి. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం వచ్చిన మాగుంట ఎన్డీఏ తరఫున అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీకి రూ. 50 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారు. 2022లో కేసు నమోదు అయితే 2024లో కవిత అరెస్టు జరిగింది. రాజకీయ కక్ష సాధింపుతో కవితపై కేసు పెట్టారు’’ అని ఢిల్లీ కోర్టులో కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి సోమవారం వాదనలు వినిపించించారు. ఇది వరకే ఈడి, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టులో ఆశ్రయించారు. లిక్కర్ కేసులో అరెస్టయి రెండు నెలలకుపైగా కవిత తిహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వినిపించిన వాదనలు..కవితను అరెస్ట్‌ చేయమని ఈడీ సుప్రీం కోర్టుకు చెప్పిందిసుప్రీంకోర్టులో ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడిందిరాజకీయ కారణాలతో పక్షపాత ధోరణితో ఈడీ అధికారులు వ్యవహరించారుమా వాదన వినకుండానే సీబీఐ ఇంటరాగేషన్‌కు ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చిందిసమాచారం ఇవ్వకుండానే సీబీఐ నన్ను అరెస్టు చేసింది: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవితఈ అంశాలపై ఎలాంటి కోర్టు ఉత్తర్వులు అప్ లోడ్ చేయలేదుపూర్తి రహస్యం పాటించడం ఎందుకు ?సీబీఐ విచారణ, అరెస్టు లో చట్టపరమైన ప్రక్రియ పాటించలేదుఈడీ కేసులో ఇప్పటివరకు ఏడు చార్జిషీట్ లు దాఖలు చేసిందిమహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదుకేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదుఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట నా పేరు చెప్పారుబెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి అని అడిగిన జడ్జికేసు గురించి అన్ని విషయాలు తెలుసన్న జడ్జికవితని అరెస్టు చేయాల్సిన అవసరం లేదు, దాని వల్ల ఈడి కి వచ్చి లాభం ఏమిటి ? అని కవిత తరపు న్యాయవాది వాదనలునేను గత మార్చి లో వరుసగా మూడు రోజులు విచారణకు వచ్చాసూర్యాస్తమయం తర్వాత కూడా నన్ను విచారించారునా మొబైల్ ఫోన్ ను కూడా ఇచ్చానుమహిళ ఫోన్‌లోకి తొంగి చూశారురైట్ టు ప్రైవసికి భంగం కలిగించారుకొత్త మోడల్ ఫోన్ లు రావడంతో పాత ఫోన్లు పని మనుషులకు ఇచ్చానుఆ ఫోన్లు పని మనుషులు ఫార్మాట్ చేశారు.. నాకేం సంబంధం లేదుకస్టడీ లో ఉన్న నిందితులతో కలిపి నన్ను ఈడి విచారణ జరపలేదుఎన్నో చార్జిషీట్లు దాఖలు చేసినా నా పేరు ఎక్కడ ప్రస్తావించలేదుమాగుంట శ్రీనివాసులురెడ్డి నాకు వ్యతిరేకంగా 164 స్టేట్మెంట్ ఇచ్చారుఆ తర్వాత రూ.50 కోట్లు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారుఎన్‌డీఏ అభ్యర్థిగా పోటీ చేశారుఅరెస్టు చేయమని సుప్రీం కోర్టు కి చెప్పి ఆ తర్వాత మాట తప్పి, కవితని అరెస్టు చేశారుసీబీఐ సమన్లు అన్నింటికీ నేను సహకరించా: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవితమహిళను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అందులో ఒకరు మైనర్: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవితనేను ఒక రాజకీయ నాయకురాల్ని: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవితబెయిల్ కు ఎలాంటి షరతులు పెట్టినా ఓకే: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవిత

Sakshi special story about International Day of Action for Women Health 2024
ఆరోగ్యం ఆమె హక్కు!

ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండాలనుకోవడం కూడా ఒక హక్కే. ఈ విషయాన్ని ప్రపంచంలోని ప్రతి మహిళా గుర్తించాలని ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా మే 28న‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యాక్షన్‌ ఫర్‌ ఉమెన్‌ హెల్త్‌’ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహిళ తన ఆరోగ్య సంరక్షణ కోసం అవగాహన పెంచుకోవడంతో ΄ాటు హక్కుగా ఎలా భావించాలో తెలుసుకోవాలి. మహిళల ఆరోగ్య సంరక్షణలో కొనసాగుతున్న ఇబ్బందులు, అవకాశాలను హైలైట్‌ చేసే ఒక ముఖ్యమైన వేడుకగా ఈ రోజును భావించాలి.మహిళల ఆరోగ్య సంరక్షణలో అసమానతలను తొలగించడానికి లాటిన్‌ అమెరికన్, కరీబియన్‌ ఉమెన్‌ హెల్త్‌ నెట్‌వర్క్‌ 1987లో గ్లోబల్‌ నెట్‌వర్క్‌ (డబ్ల్యూజిఎన్‌ఆర్‌ఆర్‌)ను ఏర్పాటు చేశారు. ఆరోగ్య సంరక్షణలో మహిళల తక్షణ అవసరాలను గుర్తించడానికి ఈ నెట్‌వర్క్‌ ఆవిర్భవించింది. మహిళల ఆరోగ్య సేవలు, హక్కులలో నిరంతరంగా వచ్చే అవాంతరాలను పరిష్కరించాలి. మరింత పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను సాధించాలనేది ఈ నెట్‌వర్క్‌ ఉద్దేశ్యం.మొదటిది ప్రసూతి ఆరోగ్యంమొదట పునరుత్పత్తి, ప్రసూతి సమయాలలో సురక్షితమైన ఆరోగ్య సేవలను ΄÷ందడంపై దృష్టి సారించడానికి ఈ రోజును కేటాయించారు. ప్రపంచంలో ముప్పై ఏళ్ల క్రితం ప్రసూతి మరణాలు అధికంగా ఉండటంతో తొలుత వాటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ తర్వాత స్త్రీల మానసిక ఆరోగ్యం, హెచ్‌ఐవి, గర్భనిరోధక సాధనాలు, నాన్‌–కమ్యూనికబుల్‌ వ్యాధులు, ఆర్థిక–సామాజిక కారకాల ప్రభావం... వంటి విస్తృత శ్రేణి అంశాలను చేర్చే దిశగా క్రమంగా విస్తరణ జరిగింది. ఒక విధంగా చె΄్పాలంటే ఈ అవగాహన అంతర్జాతీయ స్థాయిలో మహిళల ఆరోగ్య ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి సెమినార్‌లు, శిక్షణ, పరిశోధన కార్యక్రమాలను స్పాన్సర్‌ చేశాయి. నిధుల పెట్టుబడిని ్ర΄ోత్సహిస్తూ ‘సురక్షిత మాతృత్వం’ అనే థీమ్‌తో సమస్యను చేపట్టాయి. 1987 మే, 28 నుంచి ఈ రోజుకు ఓ ్ర΄ాధాన్యాన్ని కల్పిస్తూ అనేక ప్రభుత్వాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళ ΄ûర సమాజ సంస్థలు మహిళల ఆరోగ్యం కోసం తమ చేయూతను అందిస్తున్నాయి. అవగాహనే కీలకంగా! ఎవరూ ఏ మాత్రం పట్టించుకోని, హాని కలిగించే వ్యాధులతో సహా ప్రపంచవ్యాప్తంగా మహిళలను ప్రభావితం చేసే క్లిష్టమైన ఆరోగ్య సమస్యలను ఈ రోజు చర్చకు తెస్తూ, వాటిని హైలైట్‌ చేస్తుంది. బహిరంగ సమావేశాల ఏర్పాటు ద్వారా ఈ సమస్యలను వెలుగులోకి తీసుకు వస్తూ, మహిళల ఆరోగ్య సంబంధిత విద్యలను ్ర΄ోత్సహిస్తుంది. .ఆరోగ్య హక్కుల కోసం న్యాయవాదిగా!మహిళల ఆరోగ్య హక్కుల కోసం వాదించడానికి, ఆరోగ్య సంరక్షణలో జెండర్‌ సమానత్వాన్ని ్ర΄ోత్సహించే విధానాల అమలుకు అవసరమైన కార్యక్రమాల ఆవశ్యకతను నొక్కి చెప్పడానికి ఇదొక వేదికగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలోని వివిధ ్ర΄ాంతాల నుంచి మహిళల ఆరోగ్య న్యాయవాదులు, సంస్థలు, కమ్యూనిటీలను ఒకచోట చేర్చి, వారిలో సంఘీభావాన్ని పెం΄÷ందిస్తుంది. ఈ సమష్టి చర్య మహిళల ఆరోగ్య హక్కుల కోసం చేసే ఉద్యమాలను బలపరుస్తుంది.మహిళా సాధికారత మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించడం ద్వారా ఆరోగ్యం, శ్రేయస్సుపై బాధ్యత వహించడానికి ఈ ప్రత్యేకమైన రోజు మహిళలకు ఓ శక్తినిస్తుంది. ఆరోగ్య సమాచారాన్ని వెతకడానికి, సేవలను ΄÷ందడానికి తామే నిర్ణయాత్మక శక్తిలా మారే కార్యక్రమాలలో ΄ాల్గొనేలా మహిళలను ్ర΄ోత్సహిస్తుంది. మహిళల ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వాలు మద్దతునివ్వాలి. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయులలో మహిళల ఆరోగ్యం, హక్కులను ్ర΄ోత్సహించే కార్యక్రమాలలో ΄ాల్గొనేలా చేయాలి. ఆరోగ్య నిపుణులు, విధాన రూపకర్తలు, కమ్యూనిటీ నాయకులతో సహా వివిధ సంస్థలు కూడా ఇందులో భాగం కావాలన్నది డబ్ల్యూజిఎన్‌ఆర్‌ఆర్‌ నెట్‌వర్క్‌ ప్రధాన లక్ష్యం.

AP Elections 2024 May 28th Political Updates In Telugu
May 28th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 28th AP Elections 2024 News Political Updates.. 9:34 AM, May 28th, 2024విజయవాడపిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పునిన్నటి వాదనలలో పోలీసుల కుట్రలు బట్టబయలుపిన్నెల్లి విషయంలో రోజురోజుకి దిగజారుతున్న పోలీసుల తీరుపిన్నెల్లి కౌంటింగ్ లో పాల్గోకుండా పోలీసులతో కలిసి పచ్చముఠా కుట్రఇవిఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23 న హైకోర్టు ఆదేశంహైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లి పై మరో మూడు కేసులు నమోదు చేసిన పోలీసులుఇందులో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కి హైకోర్టుని మరోసారి ఆశ్రయించిన పిన్నెల్లిహైకోర్టు విచారణలో మూడు కేసులని 22 న‌ నమోదు చేసినట్లుగా పోలీసుల వెల్లడిహైకోర్టు తీర్పు తర్వాతే 23 న తప్పుడు కేసులు నమోదు చేశారన్న పిన్నెల్లి న్యాయవాదిరికార్డులు పరిశీలించడంతో రికార్డులు తారుమారు చేసినట్లు బయడపడ్డ వైనం23 న కేసులు నమోదు చేసి 24 న స్ధానిక మేజిస్డ్రేట్ కి తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదుహైకోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయంమరోవైపు ప్రభుత్వ జిఓ లేకుండా పోలీసుల తరపున వాదించిన ప్రైవేట్ న్యాయవాది అశ్వినీకుమార్తొలిరోజు వాదనలు వినిపించి రెండవ రోజు వాదనలకి గైర్హాజరైన అశ్వినీకుమార్ఆసక్తికరంగా బాదితుల తరపున ఇంప్లీడ్ పిటీషన్ వేసి వాదనలు వినిపించిన టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లుతీర్పు నేటికి వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి 8:09 AM, May 28th, 2024మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో డీజీపీ, పోలీసుల కుట్ర బట్టబయలుహైకోర్టు సాక్షిగా దొరికి పోయిన డీజీపీ, పల్నాడు పోలీసులుపిన్నెల్లిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్టుగా వెల్లడిపోలీసుల తీరుపై హైకోర్టులో వాదనల సందర్భంగా తీవ్ర విస్మయంపిన్నెల్లికి ముందస్తు బెయిల్‌పై కోర్టు తీర్పు నేటికి వాయిదామరోవైపు ప్రభుత్వం జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా పోలీసుల తరఫున వాదనలకు దిగిన లాయర్ అశ్వనీకుమార్పోలీసుల తరపున ప్రైవేట్ లాయర్ అశ్వనీకుమార్ హాజరుకావడం చర్చనీయాంశం కావడంతో నిన్నటి వాదనలకి గైర్హాజరుటీడీపీ లీగల్ సెల్ న్యాయవాది పోసాని ఇంప్లీడ్ పిటిషన్దిగ్భ్రాంతి కలిగిస్తున్న పోలీసులు తీరుపిన్నెల్లి విషయంలో రోజురోజుకూ దిగజారుతున్న డీజీపీ, పల్నాడు పోలీసులుపోలీసు రాజ్యాన్ని తలపిస్తోందన్న చర్చఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరటజూన్ 5 వరకూ ఎలాంటి అరెస్టులు వద్దని తేల్చిచెప్పిన హైకోర్టుకౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి పచ్చముఠాలతో పోలీసుల కుట్రహత్యాయత్నం సహా మూడు కేసులను ఎమ్మెల్యే పిన్నెల్లిపై నమోదు చేసిన పోలీసులువాస్తవంగా ఈకేసులను హైకోర్టు తీర్పు ఇచ్చిన మే 23నే నమోదు చేసిన పోలీసులుకాని హైకోర్టు విచారణలో మే 22న నమోదుచేసినట్టుగా హైకోర్టుకు చెప్పిన పోలీసులుపోలీసులు వాదనలపై పిన్నెల్లి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరంఏకంగా ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అభ్యంతరంవెంటనే రికార్డులు పరిశీలించిన హైకోర్టుపిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23న నమోదు చేసినట్టుగా వెల్లడిఆతర్వాత మే 24నే స్థానిక మెజిస్ట్రేట్కు తెలియపరిచినట్టుగా రికార్డుల్లో వెల్లడి వాస్తవాలు ఇలా ఉండగా పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్వనీకుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థంకాలేదన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిపీపీకి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా, దాన్ని సమర్థించేందుకు స్పెషల్ కౌన్సిల్ను కూడా పెట్టారన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిహైకోర్టు చరిత్రలో ఇదొక తప్పుడు సంప్రదాయమని తెలిపిన పిన్నెల్లి తరఫు న్యాయవాదిరికార్డులను పరిశీలించిన తర్వాత కోర్టులో తీవ్ర విస్మయంకోర్టులో ప్రొసీడింగ్స్ తర్వాత ఏపీలో పోలీసుల తీరుపై తీవ్ర చర్చఈ వ్యవహారం వెనుక ఎవరున్నారన్నదానిపై చర్చఎవరి వెన్నుదన్నుతో డీజీపీ, ఎస్సీలు ఇలా బరితెగింపునకు దిగుతున్నారన్నదానిపై చర్చచివరకు తీర్పును నేటికి వాయిదా వేసిన హైకోర్టుమరోవైపు ప్రభుత్వం నియమించిన పీపీ కాకుండా పోలీసుల తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ హాజరుపైనా తీవ్ర చర్చప్రభుత్వ జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా అశ్వనీకుమార్ హాజరుపై సర్వత్రా విస్మయంకనీసం తమ తరఫున వాదనలు వినిపిస్తున్న పీపీకి కూడా సమాచారం ఇవ్వని డీజీపీ, పోలీసులుతొలిరోజు హాజరైన అశ్వనీకుమార్ నిన్న హాజరు కాని వైనంఆసక్తికరంగా టీడీపీ లీగల్ సెల్ నుంచి న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరుబాధితుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ వేసి వాదనలు వినిపించిన పోసాని వెంకటేశ్వర్లు.ఈ వ్యవహారాలపై న్యాయవర్గాల్లో తీవ్ర చర్చ. 7:15 AM, May 28th, 2024హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ, పచ్చ పోలీసులు పిన్నెల్లిపై కేసుల విషయంలో రికార్డులు తారుమారు ఆయన్ను ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించిన హైకోర్టుముందస్తు బెయిల్‌ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకారంఈమేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులుసంబంధిత డాక్యుమెంట్లను కోర్టు ముందుంచిన పిన్నెల్లి న్యాయవాదులుపిన్నెల్లి మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు.. నేడు హైకోర్టు నిర్ణయంకౌంటింగ్‌లో పాల్గొనే హక్కు ప్రతీ అభ్యర్ధికి ఉందన్న సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి 6:45 AM, May 28th, 2024రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలుకౌంటింగ్‌ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు పోలింగ్‌ అనంతర ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టంగా ఏర్పాట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌ మీనా 6:30 AM, May 28th, 2024పెత్తందారులకు, పేదలకు యుద్ధం: సీఎం జగన్‌మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. మేము చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.-సీఎం @ysjagan… pic.twitter.com/BvDgxcKYWO— YSR Congress Party (@YSRCParty) May 27, 2024

Delhi-Varanasi IndiGo Plane Receives Bomb Threat Latest News
ఇండిగో విమానానికి బాంబ్‌ బెదిరింపు

ఢిల్లీ, సాక్షి: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుతో విమాన సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ ద్వారం నుంచి దించేసి.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మంగళవారం వేకువ జామున ఈ ఘటన చోటు చేసుకుంది.ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానం టాయిలెట్‌ మీద బాంబ్‌ అని రాసి ఉండడాన్ని సిబ్బంది గమనించారు. దీంతో.. విమానం గాల్లోకి ఎగరకముందే అప్రమత్తమైన సిబ్బంది ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. విమానాన్ని ప్రత్యేక ప్రాంతానికి తరలించారు. ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా దించేశారు. ఆపై సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది. వేకువ జామున ఐదు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ఇండిగో ప్రకటించింది. ఈ ఘటనపై కాసేపట్లో అధికారులు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. The IndiGo crew before taking off found a note with the word "bomb" written on it in the aircraft's lavatory, says aviation security official who was on the spot.— ANI (@ANI) May 28, 2024 Passengers of #IndiGo flight from #Delhi to #Varanasi were evacuated via emergency exit following a #bombthreat, earlier today.The aircraft has been moved to isolation bay and further investigations are being carried out. More details are awaited.#imxplorer #travel #indigo pic.twitter.com/QYRVgGKpIR— IMxplorer-Travel The World (@IMTravelService) May 28, 2024

Rashmika Comments In Gam Gam Ganesha Pre Release Event
ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రష్మిక పేరు చెప్పగానే చాలామందికి విజయ్ దేవరకొండనే గుర్తొస్తాడు. ఎందుకంటే వీళ్లిద్దరూ ఫ్రెండ్సా? లవర్సా? అనేది ఇప్పటికీ సస్పెన్సే. ఈ జంట పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొంది. విజయ్‌తో బాండింగ్ గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?)ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గం గం గణేశా'.. మే 31న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‍‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రష్మికని ఆనంద్ దేవరకొండ చాలా ప్రశ్నలు అడిగాడు. రీసెంట్‌గా రష్మిక పోస్ట్ చేసిన పెట్ డాగ్స్ ఫొటోలు చూపించి, వీటిలో ఏదంటే నీకు బాగా ఇష్టమని అడిగాడు. దీంతో ఆరా(రష్మిక పెట్ డాగ్) నా ఫస్ట్ బేబీ, స్టార్మ్(విజయ్ పెట్ డాగ్) నా సెకండ్ బేబీ అని చెప్పింది.నీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? అని రష్మికని ఆనంద్ అడగ్గా.. మైక్ పక్కకు పెట్టి నీ యబ్బ అని ఆనంద్‌ని సరదాగా తిట్టింది. ఆ వెంటనే మైక్ లో.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా, ఇలా స్పాట్‌లో పెడితే ఎలా అని అనడంతో ఈవెంట్‌కి వచ్చిన వాళ్లందరూ రౌడీ, రౌడీ స్టార్ అని అరిచారు. దీంతో రౌడీ బాయ్ నా ఫేవరేట్ అని విజయ్‌ని ఉద్దేశించి రష్మిక చెప్పింది. ఇలా రష్మిక-విజయ్ ఎంత క్లోజ్ అనేది మరోసారి ప్రూవ్ అయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)#AnandDeverakonda: who's your fav co-star#Rashmika: Neeyabba.. Nuvvu Naa family anand #GamGamGanesha Pre Release pic.twitter.com/ZhiSfUU6pF— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) May 27, 2024

Today Horoscope: Rasi Phalalu 28-05-2024 In Telugu
Today Horoscope: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.పంచమి ప.3.09 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.9.43 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ప.1.32 నుండి 3.04 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.56 వరకు, తదుపరి, రా.10.49 నుండి 11.34 వరకు, అమృతఘడియలు: రా.10.44 నుండి 12.16 వరకు; రాహుకాలం : ప.3.00, నుండి 4.30 వరకు, యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం : 5.29, సూర్యాస్తమయం : 6.25. మేషం: వ్యవహార విజయం. అరుదైన ఆహ్వానాలు. విందువినోదాలు. కాంట్రాక్టులు పొందుతారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు..వృషభం: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. బంధువులతో అకారణ వైరం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యసమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితుల నుంచి విమర్శలు. కాంట్రాక్టులు చేజారతాయి. పనులలో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు. కళాకారులకు సమస్యలు ఎదురుకావచ్చు.కర్కాటకం: పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొత్త ఉద్యోగయోగం.సింహం: కొత్త పనులు ప్రారంభిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహం. కళాకారులకు సత్కారాలు జరుగుతాయి.కన్య: కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. ముఖ్యమైన పనులలో అవరోధాలు. ఆరోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులకు నిరాశ.తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి.. బంధువులతో తగదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. దూరప్రయాణాలు.వృశ్చికం: నూతన ఉద్యోగయోగం. ప్రముఖులతో పరిచయాలు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రగతి కనిపిస్తుంది. వాహనయోగం.ధనుస్సు: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం. నిరుద్యోగుల యత్నాలు మందుకు సాగవు.మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాల పరిష్కారం. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. పాతమిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు.కుంభం: కుటుంబసభ్యులతో వైరం. పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు.బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చే స్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. అనుకోని ప్రయాణాలు.మీనం: మిత్రులతో వివాదాలు పరిష్కారం. ఆస్తిలాభం. బ«ంధువుల నుంచి ఆహ్వానాలు. కళాకారులకు ఊహించని అవకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలపరిస్థితి. నూతన ఉద్యోగయోగం. ప్రముఖులతో పరిచయాలు.

Sakshi Editorial On Central Election Commission
ఈసీ నోరుమెదపదేం?!

కోట్లాదిమంది పౌరులు నచ్చినవారిని, సమర్థులనుకున్నవారిని తమ ప్రతినిధులుగా ఎంపిక చేసుకునే అసాధారణ ప్రక్రియ ఎన్నికలు. ఆ ప్రక్రియను ఎంత పారదర్శకంగా...ఎంత వివాదరహితంగా...ఎంత తటస్థంగా నిర్వహిస్తే అంతగా ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఆదినుంచీ ఇందుకు విరుద్ధమైన పోకడలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడింది మొదలు చిత్ర విచిత్ర ధోరణులు కనబడ్డాయి. పోలింగ్‌ రోజైన ఈనెల 13న, ఆమర్నాడు రాష్ట్రంలో జరిగిన ఉదంతాలు వీటికి పరాకాష్ఠ. వివిధ జిల్లాల్లో చెదురుమదురుగా చోటుచేసుకున్న ఘటనలు ఒక ఎత్తయితే నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగిన ఉదంతాల పరంపర మరో ఎత్తు. టీడీపీ రౌడీ మూకలు పోలింగ్‌ కేంద్రాల్లోకి జొరబడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఏజెంట్లపై దౌర్జన్యం సాగించి వెళ్లగొట్టడం, వోటేయడానికి క్యూలో నించున్న బలహీనవర్గాలవారినీ, మహిళలనూ కొట్టి వెనక్కిపంపడం వంటి ఉదంతాలపై ఫిర్యాదు చేసినా అరణ్యరోదనే అయింది. అసాంఘిక శక్తులు చొరబడి పోలింగ్‌ ప్రక్రియను దెబ్బతీయకుండా చూడటానికీ, అవసరమైనప్పుడల్లా కిందిస్థాయి అధికారులకు తగిన ఆదేశాలివ్వడానికీ, సమస్యాత్మక ప్రాంతాలకు బలగాలు తరలించటానికీ వీలుంటుందని ఏర్పాటుచేసిన వెబ్‌కాస్టింగ్‌ను ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. దాని నియంత్రణ టీడీపీ చేతుల్లోకి పోయింది. ఆ తర్వాత రెండురోజులూ పచ్చమూకలు తెగబడి రోడ్లపై స్వైరవిహారం చేశాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు వోటేశారనుకున్నవారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాయి. ఈ మూకలకు భయపడి వందలమంది ఇళ్లూ వాకిళ్లూ వదిలి వేరేచోట తలదాచుకోవాల్సివచ్చింది. ఇదంతా చానెళ్లలో ప్రసారం అవుతున్నా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు బాధ్యతవహించాల్సిన అధికారులకుగానీ, శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సిన పోలీసు అధికారులకుగానీ చీమకుట్టినట్టయినా లేదు. ఎన్నికలకు రెండురోజుల ముందు త్రికూటమి సౌజన్యంతో విధుల్లో చేరిన ఉన్నతాధికారులు ఈ విధ్వంసకాండ సాగుతున్న సమయంలో మౌనదీక్షలో మునిగిపోయారు. పరువు బజార్నపడిందనుకున్నదో ఏమో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని నివేదిక తెప్పించుకుని ముగ్గురు ఎస్పీలనూ, ఒక కలెక్టర్‌నూ బదిలీచేసింది. మూడు జిల్లాల్లో 12 మంది పోలీస్‌ అధికారులను సస్పెండ్‌ చేసింది. సిట్‌ ఏర్పాటుచేసి దర్యాప్తు చేయించింది. ఇంత జరిగినా కారంపూడి సీఐగా ఉంటూ టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసిన నారాయణస్వామికి మాత్రం ఏం కాలేదు. ఐజీ త్రిపాఠి సరేసరి. వీరు కొత్త కొత్త కేసులు బనాయిస్తూ స్వామిభక్తిని చాటుకుంటున్నారు.త్రికూటమి ఆడించినట్టల్లా ఆడటానికి ఎన్నికల సంఘం రెడీ అయిపోయిందని ఉన్నతాధికారుల ఏకపక్ష బదిలీలు మొదలైనప్పుడే అందరికీ అర్థమైపోయింది. ఎవరిని ఎక్కడ నియమించాలో ఆదేశిస్తూ కూటమి ఇచ్చిన ఆదేశాలకు ‘జీ హుజూర్‌’ అంటూ కొత్త అధికారులను దించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారులను నియమించటంతో మొదలైన కుట్రపై లోతుగా దర్యాప్తు చేస్తే తప్ప ఎన్నికల రోజునా, ఆ తర్వాతా కొనసాగిన హింస, విధ్వంసకాండ వెనక ఏయే శక్తులున్నాయో వెల్లడి కాదు. మన దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న పోలింగ్‌ ప్రక్రియను చూసి ముచ్చటపడి అనేక దేశాలు దాన్ని అనుసరించటం మొదలెట్టాయి. ఎప్పటికప్పుడు అభివృద్ధి అవుతున్న కొత్త సాంకేతికతలతో ఎన్నికల ప్రక్రియ మరింత మెరుగ్గా, సాఫీగా సాగేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నది. మరి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు ఏమైంది? ఈ ఉదంతాల సమయంలో ఎందుకాయన మౌనంగా ఉండిపోయారు? కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునేవరకూ తన వంతుగా చేసిందేమిటి? ఎన్నికల రోజున మాచర్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 8 గ్రామాల్లో టీడీపీ రిగ్గింగ్‌ చేస్తున్న వైనం గురించి వరసగా రెండు లేఖలు రాసినా, అలాంటిచోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండు చేసినా మీనా ఎందుకు జవాబీయలేదు? ఈవీఎం పగలగొట్టినట్టు టీడీపీ ఒక వీడియో విడుదల చేసేవరకూ ఆ ఉదంతం తెలియనట్టే ఎందుకున్నారు? 23 గంటల నిడివికిపైగా ఉన్న ఆ వీడియోలో ముందూ వెనకా ఏం జరిగిందో అసలు ఎన్నికల సంఘం చూసిందా? చూస్తే ఎందుకు మౌనం వహించింది? అన్నిటికన్నా చిత్రమేమంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి అదే రోజు రీ పోలింగ్‌ కోసం డిమాండ్‌ చేయగా నాలుగైదు రోజుల తర్వాత ఆ వీడియో బయటపెట్టిన టీడీపీ ఇంతవరకూ రీపోలింగ్‌ కోరనేలేదు. వెబ్‌కాస్టింగ్‌ మొత్తం టీడీపీ ముఠా నియంత్రణలో ఉందన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం నోరు మెదపటం లేదు.ఇంత బరితెగింపుతో దేశంలో ఎక్కడా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. తన బాధ్యతేమిటో, కర్తవ్యవేమిటో మరిచి తోకపట్టుకుని పోయే చందంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం ఇప్పటికైనా మౌనం వీడాలి. నర్సరావుపేట పరిధిలోనే కాదు... ఇతర నియోజకవర్గాల్లోనూ ఈవీఎంలు ధ్వంసం చేసిన ఉదంతాలు వెల్లడయ్యాయి. మంత్రి అంబటి రాంబాబు కొన్నిచోట్ల రీపోలింగ్‌ కోరారు. వీటన్నిటికీ జవాబు రావాలి. సంజాయిషీ ఇవ్వాల్సిన స్థానంలోవున్నవారు మూగనోము పడితే అనుమానాలు మరింత బలపడతాయి. కౌంటింగ్‌ ప్రక్రియ సక్రమంగా సాగుతుందా అన్న సందేహాలు తలెత్తుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఈ తలకిందుల వ్యవస్థను నిటారుగా నిలబెట్టాలి. ప్రజాస్వామ్యంపై ప్రజలకుండే విశ్వసనీయతను కాపాడాలి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement