యువతిని రైలు కిందకు తోసి హత్య | Worst down to the murder of a young girl | Sakshi
Sakshi News home page

యువతిని రైలు కిందకు తోసి హత్య

May 25 2014 2:53 AM | Updated on Sep 2 2017 7:48 AM

మాటా మాటా పెరిగి ఆవేశంతో ఓ యువతిని రైలు కింద తోసి హత్యకు పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్ రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది.

చేగుంట,   మాటా మాటా పెరిగి ఆవేశంతో ఓ యువతిని రైలు కింద తోసి హత్యకు పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్ రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. మాసాయిపేటకు చెందిన మున్నీబీ, ఆమె కుమార్తె తస్లిం(23) మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే ఓ వివాహానికి హాజరయ్యేందుకు మున్నీబీ ముందుగానే వెళ్లిపోవడంతో తస్లిం శనివారం పరిశ్రమలో పని ముగించుకుని శ్రీనివాస్‌నగర్ రైల్వేస్టేషన్‌కు వచ్చింది.

తస్లిం పనిచేసే పరిశ్రమలోనే విధులు నిర్వర్తించే మేడ్చల్‌కు చెందిన నరేందర్ అక్కడ తారసపడ్డాడు. మాట్లాడుతుండగానే వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన నరేందర్ అటువైపు వస్తున్న రైలు కిందికి తోసేశాడు. దాంతో తస్లిం అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసిన ప్రయాణికులు నరేందర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. అయితే వారి గొడవకు కారణమేంటో తెలియలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement