AP: పెనమలూరు పీఎస్‌లో కీచక ఖాకీ | Head Constable Penamaluru Harasses Married Woman | Sakshi
Sakshi News home page

AP: పెనమలూరు పీఎస్‌లో కీచక ఖాకీ

Aug 8 2026 10:09 PM | Updated on Aug 8 2026 10:09 PM

Head Constable Penamaluru Harasses Married Woman

ప్రతీకాత్మక చిత్రం

పెనమలూరు(కృష్ణా జిల్లా): ఏపీలో మరో కీచక పర్వం వెలుగు చూసింది.  ఓ వివాహిత పట్ల హెడ్‌ కానిస్టేబుల్‌ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన చోటు చేసుకుంది.  ఓ బాధిత వివాహిత ఫిర్యాదు చేయడానికి పీఎస్‌కు వస్తే హెడ్‌ కానిస్టేబుల్‌ ఆమెను వేధింపులకు గురి చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. కృష్ణా జిల్లాలోని పెనమలూరు పీఎస్‌లో  ఈ ఘటన చోటు చేసుకుంది. 

హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న అరిసె శ్రీనివాసరావు.. ఓ వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన భర్త పట్టించుకోకపోవడంతో పెనమలూరు పీఎస్‌ను ఆశ్రయించింది ఓ మహిళ. న్యాయం కోసం వెళ్లిన బాధితురాలిని హెడ్ కానిస్టేబుల్ వేధింపులకు గురి చేశాడు.  

సాయం పేరుతో వివాహితకు పదే పదే ఫోన్‌ చేసి వేధించాడు. అర్థరాత్రి ఫోన్‌ కాల్స్‌ చేసి మరీ వేధించాడు.   హబీస్‌ ఏంటని అంటూ కుశల ప్రశ్నలతో ట్రాప్‌ చేసేందుకు యత్నించాడని, ఇంటి లోకేష్‌ పట్టాలంటూ ఫోన్‌ కాల్స్‌లో వేధించ సాగాడు. వాట్సాప్‌ కాల్‌లో బాధిత వివాహితతో అసభ్యంగా మాట్లాడుతూ వేధించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement