ఉదయం 5 గంటలకు ఈమెయిల్.. | Tech Employee Recently Shared That He Broke Down Crying After Laid Off, Opens Up About Financial And Emotional Impact | Sakshi
Sakshi News home page

ఉదయం 5 గంటలకు ఈమెయిల్..

Nov 17 2025 6:04 PM | Updated on Nov 17 2025 7:01 PM

tech employee recently shared that he broke down crying after laid off

అమెజాన్‌లో ఇటీవల చేపడుతున్న లేఆఫ్స్‌ అనేక మంది ఉద్యోగుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ తొలగింపుల్లో కొలువు కోల్పోయిన ఓ మాజీ ఉద్యోగి తన అనుభవాన్ని సామాజిక మాధ్యమాలు వేదికగా పంచుకున్నాడు. ఈ తొలగింపు ప్రక్రియపై తన అసంతృప్తిని వెల్లగక్కాడు.

అమెరికాలోని ఒర్లాండోలో నివసిస్తున్న జాన్ పాల్ మార్టినెజ్ (35) అమెజాన్‌లో టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్‌గా మూడేళ్లు పనిచేశాడు. తన ఉద్యోగం పోయిన విషయాన్ని ఉదయం 5 గంటలకు వచ్చిన ఒక ఈమెయిల్ ద్వారా తెలుసుకున్నట్లు చెప్పాడు. తొలగింపుల గురించి చాలా ఆశ్చర్యపోయానని తెలిపాడు. తన తొలగింపు గురించి కంపెనీ ఎలాంటి సూచనలు ఇవ్వలేదని చెప్పాడు.

‘ఉద్యోగం కోల్పోయిన ఆ సమయం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాను. ఏడ్చేస్తూ కుప్పకూలిపోయాను. ఆ ఉదయం ఏమి జరిగిందో కాసేపు అర్థం కాలేదు. నా కుటుంబ ఆర్థిక భవిష్యత్తు గురించే ఆలోచనలంతా. తనఖా, కారు ఈఎంఐ చెల్లింపు, క్రెడిట్ కార్డులు, నా తండ్రి వైద్య బిల్లులు.. ఇలా చాలా ఆలోచనలతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యాను’ అని వివరించాడు.

అక్టోబర్ చివర్లో తొలగింపులను ప్రకటించినప్పుడు అమెజాన్ సంస్థ బాధిత ఉద్యోగులకు 90 రోజుల పూర్తి వేతనం, ప్రయోజనాలను చెల్లిస్తానని వాగ్దానం చేసినట్లు మార్టినెజ్‌ చెప్పాడు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి అంతర్గత ఈమెయిల్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఉద్యోగులు ఆ సమయంలో అంతర్గత కమ్యూనికేషన్ కోసం వ్యాపార వనరులను కూడా ఉపయోగించవచ్చని తెలిపారు. అయితే, ఈ వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో అమెజాన్ విఫలమైందని మార్టినెజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మా ప్రయోజనాలు, స్టాక్ ఎంపికలు, ప్యాకేజీ, ఉద్యోగ నియామక సహాయం గురించి ఉద్యోగులతో కమ్యూనికేట్ చేయడంలో అమెజాన్ విఫలమైందని భావిస్తున్నాను’ అని అన్నారు.

ఇదీ చదవండి: ‘మా మేనేజర్‌ కరుణామయుడు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement