ఆధార్ యాప్ ద్వారా అడ్రస్ చేంజ్: చాలా సింపుల్ | How To Changes Your Address in Aadhaar App | Sakshi
Sakshi News home page

ఆధార్ యాప్ ద్వారా అడ్రస్ చేంజ్: చాలా సింపుల్

Jan 1 2026 4:11 PM | Updated on Jan 1 2026 4:24 PM

How To Changes Your Address in Aadhaar App

ఆధార్‌ కార్డులో చిరునామా మార్చుకోవాలంటే.. ఒకప్పుడు మీసేవ లేదు ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో.. ఇంట్లో కూర్చునే అడ్రస్ మార్చేసుకోవచ్చు. ఇప్పుడు ఆధార్ యాప్‌ ద్వారా కూడా దీనిని అప్డేట్ చేసుకోవచ్చు.

అవసరమయ్యే డాక్యుమెంట్స్
ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవడానికి గుర్తింపు కార్డుగా.. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్, ఎలక్ట్రిసిటీ బిల్లు మొదలైనవాటిలో ఎదో ఒకటి కావాలి.

అడ్రస్ అప్డేట్ చేయడం ఎలా?
➤యాప్ స్టోర్ నుంచి ఆధార్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
➤యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత.. ఆధార్ నెంబర్ & ఓటీపీ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
➤తరువాత కెమెరా స్క్రీన్‌లో.. మీ ముఖాన్ని చూపిస్తూ, గ్రీన్ లైట్ వచ్చేవరకు చూడాలి. అప్పుడప్పుడు కళ్ళుమూసి తెరవాలి.
➤ఫేస్ డిటెక్షన్ పూర్తయిన తరువాత.. హోమ్ పేజీకి వెళ్తారు. అక్కడ సర్వీసెస్ విభాగంలో.. మై ఆధార్ అప్‌డేట్ సెలక్ట్ చేసుకోవాలి.
➤అక్కడ మీ దగ్గర ఏ డాక్యుమెంట్ అందుబాటులో ఉందో ఎంచుకుని.. కంటిన్యూ చేయాలి.
➤డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తరువాత వివరాలను ఫిల్ చేయాల్సి ఉంటుంది.
➤అయితే ప్రస్తుతం ఆధార్ కార్డులో ఉన్న చిరునామా కనిపిస్తుంది, కాబట్టి మీరు మార్చాలన్న కొత్త చిరునామా ఎంటర్ చేసి కంటిన్యూ చేయాలి.
➤మీరు 'ప్రొసీడ్ టు ఫేస్ అథెంటికేషన్' క్లిక్ చేస్తే, మీ ముఖం మళ్లీ ధృవీకరించబడుతుంది.
➤ఇవన్నీ పూర్తయిన తరువాత .. ఆన్‌లైన్‌లో 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement