భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ప్రతి నెలలో జరుగుతున్న యూపీఐ లావాదేవీలు ఎక్కువవుతున్నాయి. గత నెలలో (డిసెంబర్ 2025) కూడా యూపీఐ లావాదేవీలు భారీగా పెరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.
డిసెంబర్ 2025లో జరిగిమ మొత్తం యూపీఐ లావాదేవీలు 21.6 బిలియన్లు. వీటి విలువ రూ.27.97 లక్షల కోట్లు. గతేడాదితో పోలీస్తే లావాదేవీలు 29 శాతం పెరిగింది. కాబట్టి మొత్తం మీద ఇప్పటి వరకు నమోదైనవాటిలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. నవంబర్‌లో జరిగిన లావాదేవీలు 20.47 బిలియన్లు.


