మారిన రూల్స్: పాన్-ఆధార్ లింక్ నుంచి క్రెడిట్ స్కోర్ వరకు.. | From PAN Aadhaar Rules To Credit Score Updates From January 1st 2026 | Sakshi
Sakshi News home page

మారిన రూల్స్: పాన్-ఆధార్ లింక్ నుంచి క్రెడిట్ స్కోర్ వరకు..

Jan 1 2026 3:14 PM | Updated on Jan 1 2026 3:40 PM

From PAN Aadhaar Rules To Credit Score Updates From January 1st 2026

2025 ముగియడంతో.. 2026 ప్రారంభం నుంచి అనేక మార్పులు అమలులోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా బ్యాంకింగ్ నిబంధనలు, ఇంధన ధరలు, వివిధ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఇవి జీతం పొందే వారిని, యువత, సాధారణ ప్రజలను ప్రభావితం చేస్తాయి. కొత్తగా వచ్చిన రూల్స్ గురించి వివరంగా..

పాన్ కార్డుకు ఆధార్ లింక్‌
పాన్ కార్డును.. ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి 2025 డిసెంబర్ 31న చివరి తేదీగా ప్రకటించారు. ఈ గడువును పెంచుతున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి నేటి నుంచి పాన్ - ఆధార్ లింక్ చేయడం కుదరదు. దీనివల్ల ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ను ఫైల్‌ చేయలేరు. ట్యాక్స్‌ రిఫండ్‌ను అందుకోలేరు. అలాగే ఇతర బ్యాంకింగ్‌, షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లోనూ ఇబ్బందులు తప్పవు.

క్రెడిట్ స్కోర్ అప్‌డేట్‌
ఇప్పటివరకు బ్యాంకులు ప్రతి 15 రోజులకు ఒకసారి సిబిల్ స్కోర్ అప్డేట్ చేసేవి. ఇప్పుడు క్రెడిట్ బ్యూరోలు ఇప్పుడు ప్రతి వారం కస్టమర్ డేటాను రిఫ్రెష్ చేస్తాయి. అంటే.. లోన్ చెల్లింపులు లేదా డిఫాల్ట్‌లు మీ క్రెడిట్ స్కోర్‌లో చాలా వేగంగా ప్రతిబింబిస్తాయి.

ఎల్‌పీజీ సిలిండర్ ధరలు
2026 సంవత్సరం మొదటి రోజు నుంచి ఎల్‌పీజీ కమర్షియల్ గ్యాస్ ధర రూ.111 పెరిగింది. తాజా సవరణతో.. దేశ రాజధానిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,691.50కి (గతంలో రూ. 1,580.50 గా ఉండేది) పెరిగింది. కొత్త ధరలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి.

మెరుగైన డిజిటల్ చెల్లింపు భద్రత
మోసాలను అరికట్టడానికి బ్యాంకులు UPI లావాదేవీలపై కఠినమైన తనిఖీలను, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లకు మరింత బలమైన సిమ్ ధృవీకరణ నిబంధనలను అమలు చేస్తాయి.

పిఎం కిసాన్ గుర్తింపు కార్డులు
భారత ప్రభుత్వం PM-Kisan పథకం కోసం కొత్త రైతు ఐడీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ డిజిటల్ ఐడీకి.. రైతుల భూమి రికార్డులు, పంట సమాచారం, ఆధార్ & బ్యాంక్ వివరాలు అనుసంధానించబడి ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement