‘మా మేనేజర్‌ కరుణామయుడు’ | Reddit post praising his Indian manager European mentality has gone viral | Sakshi
Sakshi News home page

‘మా మేనేజర్‌ కరుణామయుడు’

Nov 17 2025 4:09 PM | Updated on Nov 17 2025 4:18 PM

Reddit post praising his Indian manager European mentality has gone viral

ఉద్యోగులు సడెన్‌గా తమ మేనేజర్లకు మేసేజ్‌ చేస్తూ.. ఆరోగ్యం బాగాలేదు సర్‌.. ఈరోజు కొంచెం ఆఫీస్‌కు లేటుగా వస్తాను.. అని అడిగితే.. డాక్టర్‌ దగ్గరికి వెళ్లాక రిపోర్ట్‌లు సెండ్‌ చేమయనే వారున్నారు. అలాంటిది ఓ కంపెనీ మేనేజర్‌ తన కింది ఉద్యోగుల పట్ల చూపిస్తున్న కరుణకు ఫిదా అవుతున్నారు. తమ టీమ్‌ సభ్యుల్లో ఒకరు ఇటీవల జరిగిన ఓ సంఘటనను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటే తెగ వైరల్‌ అవుతోంది.

‘అమెరికన్/యూరోపియన్ మనస్తత్వంతో భారతీయ మేనేజర్’ అనే శీర్షికతో r/IndianWorkplace అనే రెడ్డిట్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ అయిన వివరాల ప్రకారం.. ‘గుడ్ మార్నింగ్, నేను ఇవాళ ఇంటి నుంచి పని చేయాలనుకుంటున్నాను. మెడలో సమస్యగా ఉంది’ అని రాశారు. దానికి మేనేజర్‌ స్పందిస్తూ..‘సరే. నిన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ఎవరైనా ఉన్నారా?’  అన్నాడు. అందుకు ఉద్యోగి తన ఫ్లాట్‌మేట్ సహాయం చేస్తాడని చెప్పినప్పుడు, మేనేజర్ మరింత భరోసా కల్పిస్తూ.. ‘డాక్టర్ ఏం చెబుతాడో నాకు అప్‌డేట్‌ ఇవ్వు. కంగారు పడకు. ఇది సాధారణ నొప్పి మాత్రమే అవ్వాలని ఆశిస్తున్నాను. ఆరోగ్యం జాగ్రత్త’ అని అన్నారు.

ఆ ఉద్యోగి గతంలో సదరు మేనేజర్‌తో ఉన్న అనుభవాన్ని పంచుకున్నారు. తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు సెలవు గురించి తెలియజేసిన ప్రతిసారీ తన మేనేజర్ చాలా సపోర్ట్‌ ఇస్తారని చెప్పారు. అవసరమైతే మరుసటి రోజు కూడా సెలవు తీసుకోమని తరచుగా చెబుతారని తెలిపారు. అత్యవసర సమావేశాలు, విశ్రాంతి తీసుకోవడం ఒకేసారి ఉంటే  పెయిడ్‌ లీవ్‌ను వృధా చేయకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని సలహా ఇస్తారని చెప్పారు. ఆ సమయంలో బలవంతం చేయరని తెలిపారు. ఇలాంటి సపోర్ట్‌ చాలా కంపెనీల్లో అరుదని పేర్కొన్నారు. తన మునుపటి మేనేజర్ కూడా అంతే దయతో ఉండేవారని, ఇద్దరు ఇలాంటి మేనేజర్లు దొరకడం నిజంగా తన అదృష్టమని పొంగిపోయాడు.

ఈ పోస్ట్‌తో నెటిజన్లు మేనేజర్‌పై ప్రశంసలు కురిపించారు. ఒక యూజరు ‘నేను తయారీ రంగంలో పని చేస్తున్నాను. ఓవర్ టైమ్ పనిచేసిన తర్వాత నేను ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చినా, నా మేనేజర్‌కు చెప్పి వెళ్లాలి. అది మా పరిస్థితి’ అన్నారు. మరొకరు, ‘మనం ఎల్లప్పుడూ ఇతరుల నుంచి మంచి విషయాలు నేర్చుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: సైనికుల ఆకలి తీర్చే మోనోరైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement