నటీనటులు ప్రశంసలనే కాదు విమర్శలను ఎదుర్కోక తప్పదు. అలా అభినందనలకు ఉప్పొంగేవారు, విమర్శలను మాత్రం తట్టుకోలేరు. ఇది వాస్తవం. ఇప్పుడు నటి కయాదు లోహర్ పరిస్థితి కూడూ ఇలాంటిదే. 2021లో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు కన్నడం, మలయాళం, తెలుగు, మరాఠీ, బెంగాళీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నాయకిగా పేరు తెచ్చుకుంటున్నారు. అయితే తమిళంలో నటించిన డ్రాగన్ చిత్రానికి ముందు ఈ భామకు అంత పేరు లేదు. ఎప్పుడైతే ప్రదీప్ రంగనాథ్‌తో డ్రాగన్ చిత్రంలో నటించారో అప్పటి నుంచి ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు.
ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా ఇటీవల ఒక నటి బరువుపై జరిగిన చర్చలో తలదూర్చిన కయాదు లోహర్‌పై కూడా విమర్శలు రావడం మొదలెట్టాయి. దీంతో తనను టార్గెట్ చేస్తున్నారని ఈ అమ్మడు వాపోతున్నారు. దీని గురించి కయాదు లోహర్ ఓ యూట్యూట్ ఛానల్‌కు ఇచ్చిన భేటీలో తన గురించి జరుగుతున్న విమర్శలు చాలా వేదనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఒక సంప్రదాయబద్దమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని తానని అన్నారు. తన గురించి వెనుక విమర్శించినా బాధపడకపోయినా అది తనను వేధిస్తూనే ఉంటుందన్నారు. అసలు తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
కాగా ప్రస్తుతం ఈ భామ తమిళంలో నటుడు అధర్వకు జంటగా నటిస్తున్న ఇదయం మురళి అనే చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అదే విధంగా జీవీ ప్రకాశ్‌కు జంటగా ఆమ్మార్టల్ అనే చిత్రం నిర్మాణ దశలో ఉంది. కాగా నటుడు శింబు సరసన ఒక చిత్రంలో నటించనున్నారు.అదే విధంగా నటుడు దనుష్‌కు జంటగా నటించనున్న చిత్రానికి లబ్బర్ బంతు చిత్రం ఫేమ్ తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించనున్నారు. వీటితో పాటూ కన్నడం, తెలుగు, మలయాళం భాషల్లోనూ ఒక్కో చిత్రంలో నటిస్తున్నారు.


