పెళ్లి చూపులు సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker). ఫస్ట్ సినిమాకే జాతీయ అవార్డు గెల్చుకున్నాడు. ఈ నగరానికి ఏమైంది?, పిట్ట కథలు, కీడా కోల వంటి సినిమాలు తెరకెక్కించాడు. డైరెక్టర్‌గా కంటే నటుడిగానే ఎక్కువ సినిమాలు చేశాడు.
హీరోయిన్‌తో లవ్?
ఈయన టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba)తో ప్రేమలో ఉన్నాడంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల దీపావళి సెలబ్రేషన్స్ కూడా ఇద్దరూ కలిసికట్టుగానే జరుపుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే వీరిమధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిక్సయిపోయారు. తాజాగా రాజు వెడ్స్ రాంబాయి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తన లవ్‌స్టోరీపై తరుణ్ స్పందించాడు.
నాదే గ్రేట్ లవ్‌స్టోరీ
మీరు రియల్ లైఫ్‌లో చూసిన గొప్ప లవ్‌స్టోరీ ఎవరిది? మీ ఫ్రెండ్స్, సెలబ్రిటీలు.. ఎవరిదైనా చెప్పండి అని యాంకర్ అడిగింది. అందుకు తరుణ్ క్షణం ఆలోచించకుండా తనదే గ్రేట్ లవ్‌స్టోరీ అని, అది ఇంకా కొనసాగుతోందన్నాడు. దీంతో యాంకర్ ఆమె పేరు నాకు తెలుసు, కానీ బయటకు చెప్పను అని నవ్వేసింది. మొత్తానికి తరుణ్ ప్రేమలో ఉన్నట్లు ప్రకటించేశాడు. ఆ లవ్ జర్నీ ఈషాతోనే అని ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి! తరుణ్- ఈషా.. మలయాళ హిట్ మూవీ 'జయ జయ జయహే' రీమేక్ 'ఓం శాంతి శాంతి శాంతి' సినిమాలో జంటగా నటిస్తున్నారు. తరుణ్‌కు ఇదివరకే పెళ్లవగా విడాకులు తీసుకుని సింగిల్‌గా ఉంటున్నాడు.
చదవండి: భరణిని ఓ కోరిక కోరిన కూతురు


